విదేశాలకు వెళ్లడానికి వీసా ఇవ్వలేదన్న కోపంతో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఇండియాలో తమ ఇంటిపై ఏర్పాటు చేసుకున్నారు. ఈ వింత ఘటన పంజాబ్ లో జరిగింది. పంజాబ్ లోని తార్న్ తరణ్ ప్రాంతంలో ఓ వ్యక్తి విదేశాలకు వెళ్లాలని కళలు కని వీసాకు అప్లై చేయగా.. రిజెక్ట్ అయ్యింది. దీంతో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని తెచ్చి తాను కొత్తగా నిర్మించుకున్న ఇంటిపై ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పంజాబ్ లోని చాలా ప్రాంతంలో తమ ఇంటి నిర్మాణంలో భాగంగా నిర్మించుకునే వాటర్ ట్యాంకులను రకరకాల బొమ్మలతో అలంకరించుకుంటారు. ఇక్కడ గతంలో కొందరు విమానం, లిక్కర్ బాటిల్, యుద్ధట్యాంకులు వంటి ఆకర్షనీయమైన అలంకారాలను ఏర్పాటు చేసుకున్న సందర్భాలు చూశాం. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏకంగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీనే తెచ్చి పెట్టడం ఆసక్తిగా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడటానికి న్యూయార్క్ వెళ్లాల్సిన అవసరం లేదన్నమాట అని, అది ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ పంజాబ్ అయ్యిందని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు! హాజరు కాలేనంటూ లేఖ!
ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో అల్లకల్లోలం! గాయపడిన 12 మంది ప్రయాణికులు! క్యాబిన్ సిబ్బంది కూడా!
ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది!
ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా!
కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: