తెలుగు జానపద కళారూపం బుర్రకథకు అరుదైన ఘనత దక్కింది. అది కూడా బైబిల్ కథ ఆధారంగా రూపొందించిన బుర్రకథ. 'శాంసన్ అండ్ దెలీలా' అనే బుర్రకథ టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్లో అధికారికంగా ఎంపికైంది. ఈ బుర్రకథను హైదరాబాద్‌కు చెందిన చిలుకూరి శ్యామ్ రావు, చిలుకూరి వసంతరావు, చిలుకూరి సుశీల్ రావు అనే ముగ్గురు సోదరులు ప్రదర్శించారు. వీరుడైన శాంసన్ అందమైన దెలీలాతో ఎలా ప్రేమలో పడతాడనే బైబిల్ కథ ఆధారంగా శాంసన్ అండ్ దెలీలా బుర్ర కథను రూపొందించారు. టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్న ఈ బుర్రకథను చిలుకూరి సుశీల్ రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ చిలుకూరి బుర్రకథ బృందం 1970 చివర, 1980 నుంచి తమ ప్రదర్శనలను స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి హైదరాబాద్ పాటు చాలా ప్రాంతాల్లో అనేక బుర్రకథ ప్రదర్శనలను ఇచ్చారు. కాగా, ఈ బృందంలోని సభ్యుల విషయానికొస్తే.. చిలుకూరి శ్యామ్ రావు సీనియర్ న్యాయవాది. చిలుకూరి వసంతరావు బెంగళూరులోని యునైటెడ్ థియోలాజికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. చిలుకూరి సుశీల్ రావు పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా!
కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్!
58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!
హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: