గుజరాత్: గుజరాత్‌లోని రాజ్ కోట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవ్వాళ (శనివారం) సాయంత్రం టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిక్కుకుని 22 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. ప్రమాదం గురించి తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మృతుల సంఖ్యను సరిగ్గా అంచనా వేయలేమని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఆరి జోబన్ తెలిపారు. ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నామని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!
హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్!
కేదార్ నాథ్ కంట్రోల్ కోల్పోయిన హెలికాప్టర్! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం! భయంతో ప్రజలు!
ఫైనల్లోకి దూసుకెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్! 26న కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్! ఫాన్స్ లో ఉత్కంఠ!
ఎవరెస్టు పర్వతంపై టీడీపీ జెండా! అనంతపురం యువకుడికి లోకేష్ 20 లక్షల సాయం! ధన్యవాదాలు తెలిపిన ఉపేంద్ర!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: