విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన పోలీసులు. విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాలకు పంపి అక్కడ నుండి చైనా కంపెనీలకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు చెందిన దాదాపు 150 మందిని కంబోడియాకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ వారిని ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఆన్లైన్ మోసాలకు ఉపయోగిస్తున్నారు. వారికి భోజనం అందించకుండా, భయపెట్టి బలవంతంగా వారితో ఈ స్కాములను చేయిస్తున్నారు.
ఫెడెక్స్ కొరియర్ స్కాం, ఆన్లైన్ జాబ్ స్కాం, క్రిప్టో కరెన్సీ, టాస్క్ గేమ్ స్కాం లు వంటి పలు రకాల స్కాం లు వీరితో బలవంతంగా చేయిస్తారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డేటా ఎంట్రీ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఇండియా నుండి ఏజెంట్లు వీరిని ట్రాప్ చేస్తున్నారు. ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్ చేయడం జరిగింది. నిరుద్యోగులు అయిన యువత దగ్గర నుంచి ఉద్యోగం ఎప్పేస్తామని 1.5 లక్షలు తెరుకుంటున్నారు. అందులో 80,000 కంబోడియా లో ఉన్న ఏజెంట్లకు ఇస్తారు, దానితో వారు పాస్పోర్ట్, వీసా ఫీజు కడతారు. అరెస్ట్ అయిన ముగ్గురు ఏజెంట్ల పై హ్యూమన్ ట్రాఫికింగ్, మరియు ఎక్స్టార్షన్ మరియు క్రిమినల్ కాన్స్పేరసి సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది.
ఇలాంటి ఆన్లైన్ మోసగాళ్ళు మీకు కూడా ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. మార్కెట్ లో ఉద్యోగాలు లేవు అని, విదేశాలలో ఉద్యోగం వస్తుంది అని ఆశపడి వారి చేతుల్లో చిక్కి మోసపోకండి. డబ్బు కోల్పోవడమే కాకుండా మీ భద్రతకు కూడా రక్షణ లేకుండా పోతుంది. మీరు వారి చేతిలో బానిసలు అయ్యే పరిస్థితి రానివ్వకండి.
ఇవి కూడా చదవండి:
ఐర్లాండ్ వెళ్ళాలి అనుకునే వారికి శుభవార్త! వర్క్ మరియు డిపెండెంట్ వీసాలు సులభతరం! ఆకర్షణీయమైన పథకాలు
సింగపూర్‌లో మరోసారి కరోనా కలకలం! కొత్తగా 25,900 కేసులు నమోదు! మాస్క్ తప్పనిసరి!
ఏపీలో భారీగా కేంద్ర బలగాల మోహరింపు! అల్లర్ల నేపథ్యంలో! స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలా!
చంద్రబాబు దంపతుల విదేశీ పర్యటన! వారం రోజులపాటు అమెరికాలో! నేటి నుండి మొదలు!
జమ్మలమడుగులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష! ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులను!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు! AI పరంగా మొదటి స్థానం! రానున్న కాలం లో భారత దేశానిదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి