మిడల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతలు కారణంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ఇజ్రాయిల్ పై దాడులకు సిద్ధమవుతుంది. దీని కారణంగా కొత్త సూచనలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఏప్రిల్ 12, 2024 ను జారీ చేసింది. ఇజ్రాయిల్ మరియు ఇరాన్ కు ప్రయాణించవద్దని విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత పౌరులకు సూచించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు దీనిని పాటించాలని తెలిపింది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్ లో నివసిస్తున్న భారతీయ పౌరులు దగ్గరలో ఉన్న ఇండియన్ ఎంబసీని సంప్రదించి, తమ పేర్లను నమోదు చేసుకోమని కోరింది. రెండు దేశాలలో ఉంటున్న భారతీయులని చాలా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏప్రిల్ 1 న సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ కన్సులేట్ పై ఇజ్రాయిల్ విమానంతో దాడి చేసింది. ఇరాన్ ఆర్మీ జనరల్, మరో ఆరుగురు ఇరాన్ సైనిక అధికారులు ఈ దాడిలో మరణించారు. ఈ నేపథ్యంలో ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయిల్ పై దాడికి సంసిద్ధమవుతుంది. దీనితో మిడిల్ ఈస్ట్ లో మరోసారి యుద్ధ వాతావరణం ఏర్పడింది.
ఇవి కూడా చదవండి:
గుంటూరు: టీడీపీ ప్రచార రథంపై రాళ్ల దాడి!! రాళ్ల దాడితో ధ్వంసం!! పీఎస్‌లో ఫిర్యాదు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి