చత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లాలోని భిలాయిలో జరిగిందీ ఘటన. రీల్స్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న భార్యను భర్త పలుమార్లు హెచ్చరించాడు. తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె తీరులో ఎలాంటి మార్పు రాకపోవడంతో శుక్రవారం ఇద్దరికీ మరోమారు గొడవ జరిగింది. ఈ సందర్భంగా ఆమె నుంచి అతడు ఫోన్ లాక్కుని వెళ్లిపోయాడు.
దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య.. భర్త బయటకు వెళ్లిన కాసేపటికే ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. మొబైల్ ఫోన్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి