ఆస్ట్రేలియాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం ఆ దేశానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు మరణించారు. ఈ విద్యార్థులు బాపట్ల, కందుకూరు కు చెందిన వారని విచారణలో తేలింది. పిక్నిక్ లో స్నేహితులతో సరదాగా గడుపుదామని వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈత కొడుతున్న సమయంలో స్నేహితుడు మునిగిపోతున్నాడని గమనించి, సహాయం చేయడానికి వెళ్లి నీటి ఉదృతకి ఇద్దరు మునిగిపోయారు. వారి మృతదేహాలను గుర్తించడం జరిగింది. వీరిలో ఒకరు వివాహం అయ్యి భార్యతో అక్కడ నివసిస్తున్నారు. ఆమె ఇటీవల సెలవలు ఇవ్వడంతో వారం రోజుల క్రితం భారతదేశానికి రావడం జరిగింది. మరొకరు చదువుకోడానికి వెళ్లారు. ఇటీవల విద్య పూర్తయ్యి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ ఉండగా ఇలా జరగటం ఎంతో విషాదకరం. ఇది నిజంగా ప్రమాదవశాత్తు మరణమేనా అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక మృతదేహాలను ఇంటికి తరలించే ప్రయత్నం చేస్తారు.
ఇవి కూడా చదవండి:
ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! మంత్రులకు ఆదేశాలు!
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం! ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం!
ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! ఫ్రీ బస్ ఎప్పటినుంచి అంటే!
టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు!
అమరావతి వాసులకు గుడ్ న్యూస్! త్వరలోనే కార్యకలాపాలు మొదలుపెట్టనున్న 3 సంస్థలు!
కోడికత్తి కేసులో మరో బిగ్ ట్విస్ట్! ఎన్ఐఏ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు!
విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందే! మదన్ మోహన్ షాకింగ్ కామెంట్స్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: