తమ దేశంలో వలసలను నియంత్రించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, ప్రధాని అంథోనీ అల్బనీస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ఈ భావనను బలపరుస్తున్నాయి. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు జారీ చేసే స్టూడెంట్ వీసా ఫీజును సిగ్గులేని స్థాయిలో పెంచింది. ఇంతవరకు రూ.710 ఆస్ట్రేలియా డాలర్లు ఉన్న స్టూడెంట్ వీసా ఫీజు ఇప్పుడు రూ.1600 ఆస్ట్రేలియా డాలర్లకు పెంచబడింది. ఈ నిర్ణయం జులై 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది.
ఇంకా చదవండి: రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు! ఆ పదకం మళ్ళీ అమలు!
ఈ భారీ వీసా ఫీజు పెంపు భారతీయ విద్యార్థులకు పెద్ద శోకంగా మారనుంది. భారతదేశం నుంచి ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వెళ్ళేవారు రెండో స్థానంలో ఉన్నారు. దాంతో, వేలాది మంది భారతీయ విద్యార్థులు ఈ నిర్ణయంతో ప్రభావితులవుతారు.
ఈ చర్యలను సమర్థిస్తూ ఆస్ట్రేలియా సైబర్ సెక్యూరిటీ, హోమ్ ఎఫైర్స్ మంత్రి క్లెర్ ఓ నీల్, తమ అంతర్జాతీయ విద్యా విధానం సమైక్యతను పునరుద్దరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మరోవైపు 2023 సెప్టెంబర్ 30వ తేదీ వరకు 548,800 మంది విదేశీ విద్యార్థులు ఈ వీసా కోసం దరఖాస్తు చేసినట్లు ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది.
ఇంకా చదవండి: WhatsAppలో కొత్త ఫీచర్! మీ ఫోటో నుండి AI అవతార్ ని ఇలా సృష్టించండి!
ఈ వీసా ఛార్జీల పెంపుతో విద్యార్థులు యూఎస్, కెనడా వంటి ఇతర దేశాలకు మళ్ళి వెళ్లే అవకాశం కూడా ఉంది. కానీ, ఆస్ట్రేలియా ప్రభుత్వం వారి వీసా విధానంలో పలు మార్పులు చేసింది. ప్రత్యేకించి, స్టూడెంట్ వీసా పొడగింపు నిబంధనల్లో మార్పులు చేయడం ద్వారా విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియాలోనే నివసించకుండా చూడటానికి ప్రయత్నిస్తోంది.
ఇంకా చదవండి: నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
అమెరికా ఇండిపెండెన్స్ డే 2024! చరిత్ర మరియు ప్రాముఖ్యత!
న్యూయార్క్ బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్‌లో! మహిళపై మిలియనీర్ బ్యాంకర్ దాడి! పదవికి రాజీనామా!
కువైట్: రెసిడెన్సీ చట్టాని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు! 750 మంది ప్రవాసులు అరెస్ట్!
దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో అంగరంగ వైభవంగా! కూటమి విజయోత్సవ వేడుకలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: