అబుదాబి: ఈరోజు, ఆదివారం 5 మే 2024 నాడు మా గల్ఫ్ కార్మికులు అందరూ కలిసి యూఏఈలో భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంటు ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి గెలిచి నరేంద్ర మోడీ ని మూడవసారి ప్రధానమంత్రిగా చూడాలని అబుదాబిలో ఉన్నటువంటి BAPS హిందూ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇరుదేశాల దౌత్య పరమైన సంబంధాల సందర్భంగా ఈ దేశంలో ఒక మంచి ఆలయం నిర్మించి ఇచ్చినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మరియు ఇక్కడ ఉన్నటువంటి రాజుకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అదేవిధంగా రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ సంబంధాలు మెరుగుపరిచి ఇరుదేశాల అభివృద్ధికి దోహదపడాలని అదేవిధంగా మేము అందరం బాగుపడాలని ఆశిస్తున్నాం అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా ఇళ్లకు ఫోన్ చేసి ప్రత్యేకంగా బంధువులకు, స్నేహితులకు ఫోన్ ద్వారా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని కోరడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంభాల మహేందర్ రెడ్డి, ఆరే శరత్ గౌడ్, పెనుకుల అశోక్, పవన్ సాయి, శ్రీను, ప్రశాంత్, సాయి, దేవన్న, ఎండపెల్లి తిరుపతి పటేల్, రమేష్, నవీన్, తిరుపతి లతో పాటుగా సుమారు 100 మంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ‘నవ సందేహాలు’ లేఖ! బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.11 వేల కోట్లు
6న రాజమండ్రి, 8న పీలేరులో ప్రధాని మోడీ! ఉత్సాహంగా లోకేష్ యువగళం!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
తాడేపల్లి ప్యాలెస్ లో వాస్తు సిద్ధాంతులు! జగన్ ను పీడిస్తున్న ఆ భయం నిజమేనా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి