సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో తీవ్ర అల్లకల్లోలం ఏర్పడింది. దీంతో విమానం తీవ్ర కుదుపుల నడుమ అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ కుదుపుల కారణంగా ఒకరు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ తెలిపింది. వివరాల్లోకి వెళితే.. లండన్ నుంచి సింగపూర్ వెళ్తుండగా తీవ్ర కుదుపులకు గురైన బోయింగ్ 777 విమానం మంగళవారం బ్యాంకాక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నారని, కుదుపుల కారణంగా ఒకరు మృతి చెందారని ఎయిర్లైన్స్ తెలిపింది. కానీ ఎంత మంది గాయపడ్డారో మాత్రం ఎయిర్లైన్స్ వెల్లడించలేదు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ క్రమంలోనే మృతుడి కుటుంబానికి సంతాపం సింగపూర్ ఎయిర్లైన్స్ సంతాపం తెలియజేస్తూ తాజాగా ట్వీట్ చేసింది. అయితే, ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడినట్లు థాయ్ మీడియా నివేదికలు చెబుతున్నాయి. గాయాల పాలైన వారిని అంచనా వేయడానికి వైద్య సిబ్బంది విమానం ఎక్కారని, అయితే వారి సంఖ్యను నిర్దారించలేమని, గాయపడని కొందరు ప్రయాణికులను దించారని థాయ్ ఇమ్మిగ్రేషన్ పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
యూరోప్ ప్రయాణికులకు పెద్ద షాక్! పెరిగిపోతున్న స్కెంజన్ వీసా ధరలు! ఎంత పెంపు అంటే!
ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే ఏం చెబుతుంది! ధోనీ ఆఖరి ఐపీఎల్ ఇదేనా! చదివేయండి!
బేబీ బంప్ తో దీపికా పదుకొనే! ఎంత క్యూట్ గా ఉందో! ఒక లుక్ వేయండి!
అమెరికాలో అరుదైన గౌరవం దక్కించుకున్న తెలుగు మహిళ! కాలిఫోర్నియాలో మొట్టమొదటి సారిగా! ఎవరు ఆమె!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి