మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా...

సింగపూర్‌లో మరోసారి కరోనా కలకలం! కొత్తగా 25,900 కేసులు నమోదు! మాస్క్ తప్పనిసరి!

2024-05-19 10:07:00

సింగపూర్‌లో మరో కరోనా ఉపద్రవం మొదలైంది. మే 5 నుంచి 11 తేదీల మధ్య కొత్తగా 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు. ‘‘మనం మరో కొవిడ్ వేవ్ ప్రారంభంలో ఉన్నాం. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు. 

ప్రభుత్వ లెక్కల ప్రకారం, కొవిడ్ కారణంగా రోజూ ఆసుపత్రి పాలవుతున్న వారి సగటు సంఖ్య 250కి పెరిగింది. అంతుకుమునుపు వారంలో ఇది 181గా ఉంది. ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది. మరోవైపు, అవసరమైన సందర్బాల్లో ఆసుపత్రి బెడ్లు అందుబాటులో ఉండేలా అక్కడి అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. అవకాశం ఉన్న సందర్భాల్లో ఆపరేషన్లను వాయిదా వేస్తున్నారు. మొబైల్ ఇన్‌పేషెంట్ కేర్ ద్వారా అనేక మందికి ఇళ్లల్లోనే చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ బారిన పడే అవకాశం అధికంగా ఉన్న వృద్ధులు, ఇతరులు, అదనపు కొవిడ్ టీకా తీసుకోవాలని సింగపూర్ మంత్రి సూచించారు. 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

గతంలో 12 నెలల్లో టీకా తీసుకోకపోతే మరో డోసు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య రెట్టింపైతే పేషెంట్ల సంఖ్య 500 లకు చేరుకుంటుందని ఆయన అన్నారు. ఈ పరిస్థితి తట్టుకునే సామర్థ్యం సింగపూర్ వ్యవస్థలకు ఉందని చెప్పారు. అయితే, ఆ తరువాత కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపైతే మాత్రం ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందని హెచ్చరించారు. ప్రస్తుతానికి తాము ఎటువంటి సామాజిక ఆంక్షలు విధించలేదని తెలిపారు. గత్యంతరం లేకపోతేనే ఆంక్షలు విధిస్తామని పేర్కొన్నారు. 

రవాణా, సమాచార కేంద్రంగా ఉన్న సింగపూర్‌లో అన్ని దేశాలకంటే ముందుగా కరోనా వేవ్ మొదలవుతుందని మంత్రి తెలిపారు. దేశంలో కరోనా ఎండ్‌మిక్‌గా మారడంతో ఏటా ఒకటో రెండో వేవ్స్ రావడం తప్పదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జేఎన్.1, దాని ఉపజాతులైన కేపీ.1, కేపీ.2లు ప్రబలంగా ఉన్నాయి. సింగపూర్‌లో  కేపీ.1, కేపీ.2 వేరియంట్ల కారణంగానే అధికశాతం కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ వేరియంట్లు వేగంగా వ్యాపించడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సింగపూర్ ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కేపీ.2 వేరియంట్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే పేర్కొంది.

ఇవి కూడా చదవండి: 

ఏపీలో భారీగా కేంద్ర బలగాల మోహరింపు! అల్లర్ల నేపథ్యంలో! స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలా! 

చంద్రబాబు దంపతుల విదేశీ పర్యటన! వారం రోజులపాటు అమెరికాలో! నేటి నుండి మొదలు! 

జమ్మలమడుగులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష! ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులను! 

కిర్గిస్తాన్ లోని భారతీయ విద్యార్ధులు ఇళ్లలోనే ఉండాలి! మంత్రి జై శంకర్ హెచ్చరికలు! అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ ని సంప్రదించాలి! 

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు! AI పరంగా మొదటి స్థానం! రానున్న కాలం లో భారత దేశానిదే! 

సింగపూర్: మలేషియాలో ఉన్నా, లేదా వెళ్తున్న వారు జాగ్రత్త పడాలి! విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు! బాంబు దాడి నేపథ్యంలో! 

భారతీయులకు ఈ 10 దేశాలకు వీసాలు లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు గడిపే అవకాశం! ఆ దేశంలో ఏకంగా ఆరు నెలలు!

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →