World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే... Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే... Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..!

సింగపూర్: జోరుగా ఆటపాటలతో సాగిన సంక్రాంతి సంబరాలు! సింగరపూర్ తెలుగు సమాజం వారి ఆధ్వర్యంలో!

2024-02-05 19:25:00

సింగపూర్ తెలుగు సమాజం ప్రతి ఏటా నిర్వహించే సంక్రాంతి సంబరాలు, ఫిబ్రవరి 3, 2024 న శనివారం స్థానిక సింగపూర్ పిజిపి హాల్ నందు అంగరంగ వైభవంగా జరిగాయి. సింగపూర్ లో తెలుగు సంస్కృతి , సాంప్రదాయాలను పరిరక్షించడం లో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం ఈ కార్యక్రమాన్ని తో ఎంతో సాంప్రదాయబద్దం గా, తెలుగు లోగిళ్ళలో ఉండే పూర్తి పండుగ వాతావరణం లో నిర్వహించారు.

ఆగ్నేయ ఆసియా లో ప్రప్రథమంగా సింగపూర్ కాలమానం లో గుణించిన తెలుగు క్యాలెండెర్ ఉండాలనే ఆలోచన చేసి,దాన్ని కార్యరూపం దాల్చేట్టు చేయటమే కాకుండా మరికొన్ని సంస్ధలకు సైతం స్పూర్తినిచ్చిన తెలుగు సమాజం సింగపూర్ కాలమానంలో తెలుగు కాలెండర్ ని వరుసగా ఏడోసారి ఆవిష్కరించారు. వీటిని అందరికీ ఉచితంగా ఇవ్వటంతో పాటు ఆండ్రాయిడ్ మరియు ఐఓస్ నందు STS TELUGU CALENDER app ద్వారా అందరికీ అందుబాటులో ఉంచారు.

సంపూర్ణ సంక్రాంతి శోభతో తీర్చిదిద్దిన ప్రాంగణంలో హరిదాసు కీర్తనలు, యువతులతో గొబ్బెమ్మ పాటలు, సంప్రదాయ ఆటలు, భోగి పండ్లు వేడుక వంటి తెలుగింటి కార్యక్రమాలతో సింగపూర్ తెలుగు వారు చాలా సాంప్రదాయబద్దం గా జరుపుకున్నారు. మగువలకు రంగవల్లులు మరియు వంటల పోటీలు నిర్వహించి విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందచేశారు. పిల్లలు మరియు పెద్దలచే పాటలు, నృత్య ప్రదర్శనలు , నాటికలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విభిన్న కార్యక్రమాల ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సుమారు 35 మంది బాల బాలికలు రామాయణాన్ని చక్కగా ప్రదర్శించి ఆహుతుల మన్నలను పొందారు. సింగపూర్ తెలుగు మనబడి పిల్లలచే నిర్వహించిన ఈ ప్రదర్శన ప్రత్యేక ఆదరణ పొందింది.

సమాజ కార్యవర్గం మరియు కొన్ని స్ధానిక రెస్టారెంట్స్ ల సహకారంతో ఏర్పాటు చేసిన మన అచ్చతెనుగు పిండివంటలు, 34 రకాల నోరూరించే వంటకాలతో కూడిన భోజనం స్థానిక తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకొంది.

తెలుగు సంక్రాంతి వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన వారందరికీ STS అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు పేరునా సంక్రాంతి శుభాకాంక్షలు,ధన్యవాదములు తెలిపారు. తమ కార్యవర్గం గత సంవత్సర కాలంగా నిర్వహించిన కార్యక్రమాలను వివరించడంతో పాటు అందరూ మరింత సహాయ సహకారాలను అందించాలని, 50వ ఆవిర్భావ దినోత్సవం లోపు సమాజ భవన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తోడ్పాటు నందించాలన్నారు. ఈ కార్యక్రమం లో సుమారు 700 తెలుగు వారు హాజరైనారని, ఫేస్బుక్ లైవ్ ద్వారా 5,000 మంది వీక్షించినట్లు నిర్వాహకురాలు సుప్రియా కొత్త తెలిపారు. భోగి రోజున సుమారు 1,000 మందికి రేగి పండ్లను అందించామని , అలానే అయోధ్య బాల రాముని ప్రతిష్టాపన సందర్భంగా అక్కడనుంచి ప్రత్యేకంగా తెప్పించిన దివ్యాక్షతలను సుమారు 1,000 మందికి పంచామన్నారు. కార్యక్రమానికి హాజరైన వారికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ, స్వచ్ఛంద సేవకులకు మరియు కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు కార్యవర్గం తరుపున గౌరవ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →