అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం అగ్రరాజ్యంలో సంచలంగా మారింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బుల్లెట్ చెవికి రాసుకుంటూ వెళ్లడంతో ట్రంప్ తృటిలో ప్రాణపాయం నుండి బయటపడ్డాడు. ట్రంప్ పై దాడితో ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి ఒక నిందితుడిని స్పాట్లోనే కాల్చి చంపారు. ట్రంప్ పై మర్డర్ అటెంప్ట్ నేపథ్యంలో అమెరికాలో హై అలర్ట్ ప్రకటించారు. పెన్సిల్వేనియా బట్లర్ లో ట్రంప్పై దాడి జరిగిన ప్రాంతాన్ని అమెరికా సీక్రెట్ సర్వీస్ లు చుట్టుముట్టాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆ ప్రాంతంలోని బిల్డింగ్ లను తమ ఆధీనంలోకి తీసుకుని ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సీక్రెట్ సర్వీస్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. AR-15 సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తో ట్రంప్ పై కాల్పులు జరిపినట్లు భద్రతా దళాలు నిర్ధారించాయి. ట్రంప్ కు 182 మీటర్లు దూరం నుండి ఫైరింగ్ జరిపినట్లు గుర్తించారు. ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సభావేదికకు ఎదురుగా ఉన్న ఎత్తైన ప్రదేశం నండి కాల్పులు జరిపిన దుండగుడు.. మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ట్రంప్ ఘటనపై విచారణను అమెరికా సీక్రెట్ సర్వీసెస్ స్పీడప్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!
రాజస్థాన్ లో ఫేక్ డీగ్రీ స్కామ్! 43 వేల ఫేక్ డిగ్రీలు జారీ! దర్యాప్తు ప్రారంభం!
బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం! క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ!
నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: