అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. ఉత్తర కెంటకీలోని ఫ్లోరెన్స్ సిటీలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. కాల్పుల అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు చేజ్ చేసే క్రమంలో అతడి కారు గుంతలో పడింది.
ఇంకా చదవండి: అమెరికా ఇండిపెండెన్స్ డే 2024! చరిత్ర మరియు ప్రాముఖ్యత!
తెల్లవారుజామున 2.50 గంటలకు ఓ ఇంట్లో ఈ ఘటన జరిగిందని, సమాచారం అందుకుని వెళ్లేసరికి ఏడుగురు బాధితులు కనిపించినట్టు పోలీసులు తెలిపారు. అప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని తాము పట్టుకున్నామని, అప్పటికే అతడు తనకు తాను కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించినట్టు పోలీసులు తెలిపారు. అతడిని ఆసుపత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. బర్త్ డే పార్టీ సందర్భంగా ఈ ఘటన జరిగిందని, నిందితుడు ఇంటి యజమాని కొడుకే(21)నని, ఈ ఘటనలో ఇంటి యజమాని కూడా మృతి చెందినట్టు చెప్పారు.
ఇంకా చదవండి: తప్పంతా నాదే.. ట్రంప్‌తో బహిరంగ చర్చలో వైఫల్యంపై బైడెన్! ఈ విశ్రాంతి సరిపోలేదా?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!
ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు! ఎంతో తెలుసా?
7న హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం! ఎందుకో తెలుసా?
కువైట్ లోని గృహ కార్మికులకు శుభవార్త! ఆనందంలో ప్రవాసులు!
ఆస్ట్రేలియా పార్లమెంట్ పైకప్పుపై నిరసన! అనుకూల మద్దతుదారులు అరెస్ట్!
WhatsAppలో కొత్త ఫీచర్! మీ ఫోటో నుండి AI అవతార్ ని ఇలా సృష్టించండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: