అమెరికా జూలై 4న ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంది. అమెరికా ఇండిపెండెన్స్ డేకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ వివరాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికన్లు జూలై 4న తమ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశభక్తితో జరుపుకుంటారు. ప్రజలు వీధుల్లో ఊరేగింపులు, నినాదాలతో స్వాతంత్య్ర వైభవాన్ని ఆస్వాదిస్తూ సంబరాలు చేసుకుంటారు. 248 సంవత్సరాల క్రితం, జూలై 4న స్వాతంత్య్ర ప్రకటన పత్రం ప్రచురించిన తరువాత, అమెరికా స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈ ప్రత్యేకమైన రోజును సగర్వంగా, వైభవంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
ఇంకా చదవండి: USA అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తికరమైన పరిణామాలు! భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యత!
యుఎస్ ఇండిపెండెన్స్ డే 2024: తేదీ, చరిత్ర
ప్రతి సంవత్సరం జూలై 4న యుఎస్ ఇండిపెండెన్స్ డే (US Independence Day 2024) జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూలై 4న గురువారం వస్తుంది. 1775లో, కింగ్ జార్జ్ 3 నాయకత్వంలోని బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్య్రం పొందడానికి పదమూడు అమెరికన్ కాలనీల తిరుగుబాటుతో అమెరికన్ విప్లవం ప్రారంభమైంది. బ్రిటిష్ అణచివేత విధానాల నుంచి విముక్తి పొందాలనే దృఢ సంకల్పం, స్వపరిపాలన చేసుకోవాలనే ఆకాంక్ష ఈ స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపించింది. 1776 జూలై 2న, బ్రిటిష్ పాలనను అంతం చేయాలనే ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్ ఓటు వేసింది. ఆ తరువాత 1776 జూలై 4న, స్వాతంత్య్ర ప్రకటనను ఆమోదించి ప్రచురించారు. జూలై 8, 1776న ఆ స్వాతంత్య్ర ప్రకటనను బహిరంగంగా వినిపించారు. 1776 ఆగస్టు 2న అమెరికా స్వాతంత్య్ర ప్రకటనపై అధికారికంగా సంతకాలు జరిగాయి.
ఇంకా చదవండి: అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యత
జూలై 4న అమెరికా స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. బ్రిటిష్ అణచివేత పాలన నుండి విముక్తి పొందింది. ఈ రోజున అమెరికన్లు దేశభక్తితో ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకుంటారు. జూలై 4న దేశవ్యాప్తంగా కచేరీలు, నినాదాలు, కుటుంబ సమావేశాలతో జరుపుకుంటారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్టాక్ మార్కెట్లు మూతపడటంతో దీనిని ఫెడరల్ సెలవు దినంగా పాటిస్తారు.
ఇంకా చదవండి: నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
న్యూయార్క్ బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్‌లో! మహిళపై మిలియనీర్ బ్యాంకర్ దాడి! పదవికి రాజీనామా!
కువైట్: రెసిడెన్సీ చట్టాని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు! 750 మంది ప్రవాసులు అరెస్ట్!
దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో అంగరంగ వైభవంగా! కూటమి విజయోత్సవ వేడుకలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: