అమెరికాలో మరో దారుణం వెలుగుచూసింది. ఓక్లహామాలో ఓ హోటల్ లో మేనేజర్‌గా పనిచేస్తున్న 59 ఏళ్ల భారతీయ-అమెరికన్ హేమంత్ మిస్త్రీ అనే వ్యక్తి ముఖంపై ఓ దుండగుడు పిడిగుద్దులు గుద్దాడు. దీంతో హేమంత్ ప్రాణాలు కోల్పోయారు. జూన్ 22న రాత్రి 10 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. 41 ఏళ్ల రిచర్డ్ లూయిస్ అనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. హోటల్ ప్రాంగణంలో ఉండొద్దంటూ హేమంత్ మిస్త్రీ కోరడంతో నిందితుడు ఆగ్రహంతో పిడిగుద్దులు కురిపించాడని పోలీసులు వివరించారు. దెబ్బలు తాళలేక పోయిన మిస్త్రీ స్పృహతప్పి పడిపోయాడని, ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని వెల్లడించారు. చికిత్స పొందుతూ జూన్ 23న చనిపోయాడని చెప్పారు. కాగా ఒక హోటల్‌లో దాక్కున్న నిందితుడు లూయిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రస్తుతం ఓక్లహామా కౌంటీ జైలులో ఉంచారు. కాగా నిందితుడిని హోటల్ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని ఎందుకు అడిగారో తెలియరాలేదని, దర్యాప్తు చేస్తామని పోలీసులు ప్రకటించారు. కాగా హేమంత్ మిస్త్రీ గుజరాత్‌కు చెందినవారు.
ఇంకా చదవండి: అమెరికా: తెలుగు విద్యార్ధిపై కాల్పుల ఘటనలో నిందితుడి అరెస్ట్! వారంలో రెండు నేరాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేయడంపై! అర్ధ రూపాయి డైలాగ్ చెప్తు జగన్ ట్వీట్!
అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!
యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్!
రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!
ఇకపై నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం! ఈవో ఆదేశాలు జారీ! పోటు కార్మికులతో సమావేశం!
ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే! గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందా!
ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: