ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీని చిత్తుగా ఓడించి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో అమెరికా లో బే ఏరియా కి చెందిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభిమానులు, టీడీపీ, జనసేన మరియు భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. జూన్ 16 ఆదివారం సాయంకాలం కాలిఫోర్నియా రాష్ట్రంలో ఫ్రీమోంట్ నగరంలోని సెంట్రల్ పార్క్ ఈ సంబరాలకి వేదిక అయ్యింది. ఎన్నారై తెలుగుదేశం అధ్యక్షులు కోమటి జయరాం పర్యవేక్షణలో స్థానిక ఎన్నారై టీడీపీ ప్రముఖులైన కోగంటి వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆద్యంతం వైభవంగా జరిగింది.
అమెరికా: కాలిఫోర్నియాలో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు! 250 కార్లతో ర్యాలీ!