భారత్‌లో ఓ అమెరికా మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. రాజస్థాన్‌కు చెందిన ఓ నగల వ్యాపారి ఆమెను దారుణంగా మోసం చేశాడు. రూ.300 గిల్టు నగలను బంగారు ఆభరణాలుగా నమ్మించి ఏకంగా రూ.6 కోట్లకు అమ్మాడు. తాజాగా నిందితుడు, అతడి తండ్రిపై పోలీసు కేసు నమోదైంది. అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళకు 2022లో రాజస్థాన్‌లోని జైపూర్ జోహ్రీ బజార్‌కు చెందిన నగల వ్యాపారి గౌరవ్ సోనీ, అతడి తండ్రితో పరిచయమైంది. ఈ క్రమంలో వారు ఆమెకు బంగారు ఆభరణాల పేరిట గిల్టు నగలను అమ్మి ఏకంగా రూ. కోట్లు దండుకున్నారు.
ఇంకా చదవండి: అమెరికాలో ఒక వింత చోటుచేసుకుంది! ఒకేసారి దగ్గు, తుమ్ము.. పొట్టపగిలి పేగులు బయటకు! అసలు విషయం తెలిస్తే షాక్!
నగలతో అమెరికాకు చేరుకున్న ఆమె వాటిని ఓ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచగా అవి నకిలీవని తేలింది. దీంతో, అగ్గిమీదగుగ్గిలమైన మహిళ భారత్‌కు తిరిగొచ్చి తండ్రీకొడుకులను నిలదీసింది. వారు మాత్రం తాము తప్పు చేయలేదని బుకాయించారు. దీంతో, మహిళ పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు భారత్ లోని అమెరికా ఎంబసీ అధికారులను ఆశ్రయించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఎంబసీ అధికారులు స్థానిక పోలీసులను కోరారు. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న తండ్రీకొడుకుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేబట్టారు.
ఇంకా చదవండి: ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: