ఆస్ట్రేలియన్-అమెరికన్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారు, మీడియా దిగ్గజం రూపెర్ట్ ముర్డోక్ ఐదోసారి వివాహం చేసుకున్నారు. 93 ఏళ్ల మీడియా మొగల్ శనివారం 67 ఏళ్ల ఎలెనా జుకోవాతో ఐదో పెళ్లి చేసుకున్నారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం రూపర్ట్ మర్దోక్ లాస్ ఏంజెల్స్‌లోని బెల్ ఎయిర్‌లోని మోరగా వైన్యార్డ్ ఎస్టేట్‌లో ఐదవ సారి పెళ్లి చేసుకున్నారు. తన కంటే 25 ఏళ్లు చిన్న అయిన మాజీ శాస్త్రవేత్త ఎలీనా జుకోవాను పెళ్లాడారు. 93 ఏళ్ల మర్డోక్, 67 ఏళ్ల జుకోవా బంధుమిత్రుల సమక్షంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
ఇంకా చదవండి: అమెరికాలో మరోసారి న్యూస్ లో నిలిచిన తెలుగు తేజం! 12 సంవత్సరాలకే ఇంత ప్రతిభ సాధించడం అంటే! అసాధ్యం సుసాధ్యం!
ఎమీలియా విక్‌స్టెడ్ రూపొందించిన అద్భుతమైన శ్వేతవర్ణం గౌనులో మెరిసిపోగా, మర్డోక్ స్నీకర్లతో కూడిన నల్లటి సూట్‌ను ధరించారు. ఇక ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం 1991లో మాస్కో నుండి అమెరికాకు వలస వచ్చిన రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్ ఎలెనా జుకోవా. గతంలో బిలియనీర్ ఎనర్జీ ఇన్వెస్టర్ అలెగ్జాండర్ జుకోవ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే, వీరి వివాహ బంధం మూడేళ్లు మాత్రమే కొనసాగింది. ఆయనతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటున్న జుకోవాకు మార్చిలో మర్డోక్‌తో నిశ్చితార్థం జరిగింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: