అమెరికాలో భారత సంతతికి చెందిన బాలుడు 90 సెకన్లలో 29 పదాలను తప్పుల్లేకుండా సరిగ్గా స్పెల్లింగ్ చేసి 2024 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్ గా నిలిచాడు. ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ గురువారం జరిగిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో 30 పదాలలో 29 పదాలను సరిగ్గా ఉచ్చరించాడు. దీంతో అతనికి కాప్తో పాటు $50,000 ప్రైజ్మనీ లభించింది. ఈ ఏడాది ఈ పోటీల్లో మొత్తం 245 మంది విద్యార్థులు పాల్గొనగా, వారిలో 8 మంది ఫైనల్కు చేరుకున్నారు. ఫైజాన్ జాకీ, బృహత్ సోమ మధ్య పోటీ టై కావడంతో ఇద్దరికి మరోచాన్గా 90 సెకన్ల సమయం ఇచ్చారు. ఫైజాన్ జాకీ 20 పదాలను సరిగ్గా చెప్పగా, బృహత్ సోమ 29 పదాల స్పెల్లింగ్లను తప్పుల్లేకుండా చెప్పి విజేతగా నిలిచాడు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ది EW స్క్రిప్స్ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ అయిన ఆడమ్ సింసన్ బ్రూహత్కు ఛాంపియన్ షిప్ ట్రోఫీని అందించారు. కేవలం 12 సంవత్సరాల వయస్సులో, బ్రూహత్ తన జ్ఞానం, ప్రశాంతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని సిమ్సన్ చెప్పారు. స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో బ్రూహత్ సోమ పాల్గొనడం ఇది మూడోసారి. ఇంతకుముందు 2023లో 74వ స్థానం, 2022లో 163వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుత పోటీలో రెండో స్థానంలో నిలిచిన టెక్సాస్లోని అలెన్కు చెందిన జాకీ $25,000 అందుకున్నాడు. బృహత్ సోమ తెలుగు సంతతికి చెందిన వాడు. బృహత్ తండ్రి శ్రీనివాస్ సోమ స్వస్థలం తెలంగాణలోని నల్గొండ.
ఇవి కూడా చదవండి:
ఆ రెండు విషయాల్లో ఎమిరేట్స్ ఒకటవ స్థానంలో! ప్రీమియం ఎకానమీ కేక! ఓవర్ ఆల్ లో మాత్రం నెంబర్ 1 అదే!
ఎయిర్‌లైన్స్ రేటింగ్స్ ర్యాంకింగ్స్‌లో ఎయిర్ న్యూజిలాండ్ అగ్రస్థానం! టాప్ 5 స్థానాలలో ఏవంటే?
2019లో ఎగ్జిట్ పోల్ లో 151 వైసీపీకి అని చెప్పిన KK సంస్థ! ఈసారి NDAదే హవ! వివరాలు అన్ని...
కౌంటింగ్ రోజు కఠిన నిబంధనలు! పోలీసుల మాక్‌డ్రిల్! ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు!
జూన్ 4 రాత్రి 8-9 గంటలకల్లా తుది ఫలితాలు! వెల్లడించిన సీఈఓ మీనా! ఆ రోజు రాష్ట్రంలో 144 సెక్షన్!
సికింద్రాబాద్-రేపల్లె రైలులో ఎగిసిపడిన నిప్పురవ్వలు! నిలిచిపోయిన రైలు! ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు!
10వ తరగతి హిందీ సబ్జెక్టులో 35! రీకౌంటింగ్ లో 89! ప్రభుత్వం తీరు అలా ఉంది మరి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: