అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన తెలుగు విద్యార్ధి బైక్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ విషాద ఘటన బుధవారం (మే 23) చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోలేం అచ్యుత్ అనే యువకుడు అమెరికాలోని న్యూయార్ నగరంలోని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ (SUNY)లో విద్యను అభ్యసిస్తున్నాడు.
బుధవారం సాయంత్రం బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతడి అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాం. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని తిరిగి భారత్ కు పంపించేందుకు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తాం’’ అని కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్’ లో పోస్టు పెట్టారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తానా టీం స్క్వేర్ సభ్యులు మృతదేహాన్ని భారతదేశానికి పంపేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాగా దీనికి అయ్యే ఖర్చు మొత్తం ఎంబసీ తో పాటు తానా టీం కూడా సాయం అందించనుంది. నర్సీపట్నం కి చెందిన మృతుడిది మద్యతరగతి కుటుంబం, తల్లితండ్రులు ఇద్దరు వ్యవసాయం చేస్తారు. ఇతనికి ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. చెల్లి btech ఫైనల్ ఇయర్ చదువుతుంది మరియు తమ్ముడు మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అంతా సక్రమంగా జరిగితే సోమవారానికి మృతదేహం భారతదేశానికి రానున్నది.
వ్యవసాయ కుటుంబం అయినా కూడా పిల్లలు గొప్ప చదువులు చదవాలని కాయ కష్టం చేసుకుంటూ అప్పు చేసి మరీ ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నారు. ఆ అప్పు భారం తో పాటు అకస్మాత్తుగా కొడుకును కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయం. నర్సీపట్నం టిడిపి అభ్యర్ధి చింతకాయల అయ్యన్నపాత్రుడు తో పాటు వారి కుమారుడు విజయ్ మరియు స్థానిక నేతలు మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోయినవారిని తిరిగి తీసుకురాలేకపోయిన తాము చేయగలిగిన సాయం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ స్పెషల్ ఫోకస్! వీడియో లీక్ పై విచారణ! చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో!
ఎవరెస్టు పర్వతంపై టీడీపీ జెండా! అనంతపురం యువకుడికి లోకేష్ 20 లక్షల సాయం! ధన్యవాదాలు తెలిపిన ఉపేంద్ర!
సింగపూర్: గ్లోబల్ ర్యాంకింగ్‌లో 50 ఉత్తమ నగరాల్లో! సౌత్-ఈస్ట్ ఆసియా లో ఏకైక నగరం! లండన్ కూడా!
జయ బాడిగకు చంద్రబాబు అభినందనలు! కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా! విజయవాడ వారు కావడం గర్వకారణం!
వైరల్ అవుతున్న ఇన్ స్టా వీడియో! విద్యార్థితో కలసి సరదాగా టీచర్ డ్యాన్స్! 1.3 కోట్ల వ్యూస్!
హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్ లో కల్తీ! నటుడు బ్రహ్మాజీ ఫన్నీ కామెంట్స్! నెటిజన్ల రియాక్షన్ ఇదే!
తీవ్ర విషాదం... విరిగిపడిన కొండచర్యలు! 100 మందికి పైగా మృతుల సంఖ్య! ఎక్కడ అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: