అమెరికా వెళ్ళే విద్యార్ధుల సంఖ్య ఇటీవల బాగా పెరిగిపోయింది. యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇమిగ్రేషన్ ప్రక్రియలు కఠినతరం చేసిన తర్వాత ఇధి ఇంకా పెరిగిపోయింది. అయితే తాజాగా అమెరికా స్టూడెంట్ వీసాకు ఆదివారం అర్ధరాత్రి దాటాక స్లాట్లను విడుదల చేయడం జరిగింది. కేవలం 5 నిమిషాల్లోనే 10వేల స్లాట్లు బుక్ అయిపోయాయి. సోమవారం నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం అయ్యాయి. కానీ, వేల కొద్ది విద్యార్థులకు వీసా ఫీజు (రూ.15,530) చెల్లించిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి కాలేదు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సాంకేతిక సమస్యలు ఏమో అని విద్యార్ధులు అందరూ ఆందోళన పడ్డారు. దరఖాస్తు కోసం పదేపదే ప్రయత్నించినా, ఉపయోగం లేకుండా పోయింది. కొందరు విద్యార్ధులకు ‘లిమిట్ రీచ్డ్’ అనే సందేశం రావడం, మరికొందరు ఫీజు చెల్లించిన తర్వాత ‘లాక్డ్’ కేటగిరీలో ఉంది అని చూపడంతో ఎంతో కంగారూ పడుతున్నారు. అమెరికాలోని అధికారులకు మెయిల్ పెట్టి ఎంతో కష్టపడి అన్‌లాక్ చేయించుకున్నాక కూడా తిరిగి ‘లాక్డ్’ కేటగిరీకి వెళ్తోందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
ముంబయిలో బాయిలర్ పేలడంతో అగ్నిప్రమాదం! ఆరుగురి మృతి! 30 మందికి పైగా! కిలోమీటరు దూరం వరకు!
ఘటనలు జరిగిన అన్ని ప్రదేశాల్లో వీడియోలు బయటపెట్టాలి! వైసీపీకి మొదలైన వణుకు.. ఒక్కొక్కరికి ఇక మోతే!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: