ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు పై కోమటి జయరామ్ స్పందించారు.... నచ్చిన పార్టీకి ప్రచారం చేసే ప్రాథమిక హక్కు ఎన్ఆర్ఐ గా తనకు ఉందని టీడీపీ ఎన్నారై విభాగం సమన్వయకర్త కోమటి జయరామ్ స్పష్టం చేశారు. తాను భారత దేశ చట్టాల్ని గౌరవిస్తూ, పాటిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం నాయకులతో నిర్వహించిన సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను కావాలనే వైసీపీ నాయకులు వక్రీకరించారని ఆరోపించారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ సమావేశంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా మాట్లాడారంటూ వైసీపీ నేత ఏఎస్ఎస్ మూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో సీఈవో ఎంకే మీనా.. కోమటి జయరామ్ కు నోటీసులిచ్చారు. దీనిపై కోమటి జయరామ్ నిన్న (గురువారం) వివరణ ఇచ్చారు. ఎన్ఆర్ఐ లతో నిర్వహించిన సమావేశం రహస్యంగా జరిగింది కాదు. ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యునిగా ప్రవాసాంధ్రులను పార్టీ కోసం పని చేయాలని అభ్యర్థించాను. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకున్నాం. దానికి సొంత నిధులను వినియోగించాలని సూచించాం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ వర్గాలకు జరిగిన మేలును ప్రచారం చేయడమే మా లక్ష్యం.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

నేను ప్రభుత్వ సలహాదారులపై తప్పుడు వ్యాఖ్యలు చేశానని, ప్రజలకు లంచాలిచ్చి ప్రభావితం చేయాలని చూశామని చెప్పడం సరైనది కాదు. ఎన్నో ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్నాను. ఏనాడూ నిబంధనలు ఉల్లంఘించలేదు అని కోమటి జయరాం వివరణ ఇచ్చారు. తనపై వైసీపీ వాళ్లు ఉద్దేశపూర్వకంగానే ఫిర్యాదు చేసారని వాస్తవాలను పరిశీలించి తదుపరి చర్యలు నిలిపివేయాలని సీఈవోను కోరారు.

ఇవి కూడా చదవండి:  

ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులపై వీసా రెడ్డి ఫైర్! ఘాటుగా స్పందించిన ఎన్ఆర్ఐలు! డిపాజిట్ కూడా గల్లంతే

 

దస్తగిరి: పులివెందులలో నామినేషన్ వేసేందుకు కష్టాలు! పోటీ చేయకపోతే వైసీపీ నేతలు రూ.5 కోట్లు

ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ అభిమాని, సినీ నటి! స్వతంత్ర అభ్యర్థిగా పోటీ! సినిమాల్లోనూ కీలక పాత్ర

 Evolve Venture Capital 

రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు

స్టేఆర్డర్ కాపీ తెచ్చేలోగానే ఇల్లు కూల్చేశారు! యువనేత ఎదుట ఓ ప్రముఖుడి ఆవేదన! చేనేతలపై ప్రత్యేక ప్రేమ

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group