కెనడాలో భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం సర్రీ నగరంలో అతడిపై నిందితులు కాల్పులు జరపడంతో కన్నుమూశాడు. జూన్ 7న సర్రీలోని 164 స్ట్రీట్‌లోని 900-బ్లాక్‌లో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే యువరాజ్ మృతి చెందాడు. పైచదువుల కోసం గోయల్ 2019లో కెనడా వెళ్లాడు. ఇటీవలే అతడికి శాశ్వత నివాసార్హత అనుమతి వచ్చింది. యువరాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు.
ఇంకా చదవండి: లండన్ విమానాశ్రయంలో 2 సార్లు టేక్-ఆఫ్ కు ప్రయత్నించి విఫలమైన బ్రిటిష్ ఎయిర్‌వేస్! ప్రయాణీకుల తిప్పలు!
యువరాజ్‌కు ఎటువంటి నేర చరిత్ర లేదు. అతడి హత్యకు గల కారణం కూడా ఇంకా తెలియరాలేదు. ఈ కేసులో పోలీసులు సర్రీకి చెందిన మన్వీబాస్రామ్ (23), సాహిబ్ బాస్రా (20), హర్కిరత్ ఝుట్టీ (23), ఓంటారియోకు చెందిన కీలాన్ ఫ్రాంకాయిస్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై శనివారం హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. నిందితులు కావాలనే యువరాజ్‌ను టార్గెట్ చేసినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే, హత్యకు కారణమేంటనేది తెలియాల్సి ఉంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: