మద్యపానం వల్ల ఆదాయం సంగతి పక్కన పెడితే ఆరోగ్యం కూడా పాడవుతుంది. డబ్బులు పెట్టి మరీ అనారోగ్యాన్ని, చావును కొని తెచ్చుకోవడమే మద్యం సేవించడం. ఒకసారి మద్యానికి అలవాటు అయిన వారు దాన్ని వదలలేక బానిసలు అవుతూ ఉంటారు. దీంతో సంపాదించిన డబ్బులే కాకుండా అప్పులు చేసి మరీ మద్యానికి డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే అందరూ మద్యం తాగేందుకు డబ్బులు ఖర్చు పెడుతుండగా.. ఒక వృద్ధుడు మాత్రం డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇప్పటివరకు ఏకంగా రూ.26 లక్షలు సంపాదించి ఔరా అనిపించాడు. ఇంతకీ ఇతనికి డబ్బులు ఎవరు ఇస్తున్నారంటే. బ్రిటన్‌కు చెందిన 65 ఏళ్ల నిక్ వెస్ట్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా బీర్లు తాగి ఏకంగా రూ.26 లక్షలను తన ఖాతాలో వేసుకున్నాడు. గత 42 ఏళ్లుగా బీర్ టిన్‌లను సేకరిస్తూ ఉన్నాడు. దీంతో ఇప్పటివరకు నిక్ వెస్ట్ ఏకంగా 10 వేలకుపైగా బీర్ టిన్లను సేకరించాడు. అందులో కొన్ని చాలా అరుదైన బీర్ టిన్లు కూడా ఉన్నాయి.
ఇంకా చదవండి: కెనడాలో ఖలిస్థానీ అనుకూల ర్యాలీ! భారత్ అగ్గిమీద గుగ్గిలం!
అయితే చిన్నతనం నుంచి వస్తువులను సేకరించడం పట్ల ఇష్టం ఉన్న నిక్ వెస్ట్.. ఆ తర్వాత బీర్ టిన్లను సేకరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మొత్తం 10,300 బీర్ టిన్లు పోగేశాడు. ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి మద్యం సేవించడం ప్రారంభించిన నిక్ వెస్ట్ ఆ తర్వాత బీర్లు అలవాటు చేసుకున్నాడు. అలా బీర్లు తాగుతూనే.. ఖాళీ బీర్ టిన్లను దాచిపెట్టడం ప్రారంభించాడు. ఇక బీర్ టిన్లను సేకరించేందుకు ఏకంగా 5 బెడ్ రూమ్‌ల ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇలా చేయడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు.
అయితే మొదట్లో బాగానే ఉన్నా నిక్ వెస్ట్.. పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఉన్న డబ్బులంతా బీర్లకు ఖర్చు చేయడంతో చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది. దీంతో తాను పోగు చేసిన బీర్ టిన్లను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మొదట 6 వేల బీర్ టిన్లను అమ్మగా.. వాటికి 13500 డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.12 లక్షల వరకు వచ్చాయి. ఇక అతని వద్ద ఉన్న మరిన్ని స్పెషల్ బీర్ టిన్స్ విక్రయించగా.. మరిన్ని డబ్బులు వచ్చాయి. దీంతో నిక్ వెస్ట్ ఏకంగా రూ.26 లక్షలు సంపాదించాడు. ఇక తన వద్ద 1936 నాటి బీర్ టిన్ ఉందని నిక్ వెస్ట్ వెల్లడించాడు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: