రజనీకాంత్ తర్వాత తెలుగులో ఆ రేంజ్ మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరో విజయ్ దళపతి. అంతెందుకు.. ఒక కోలీవుడ్ హీరో సినిమాకు తెలుగులో రూ.20 కోట్ల బిజినెస్ జరగడం అంటే మాములు విషయం కాదు. లియో సినిమాతో అది కూడా జరిగిపోయింది. ఇక తమిళనాట విజయ్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా రిలీజవుతుందంటే అక్కడ పెద్ద పండగే. డే1 నుంచి కలెక్షన్ల సునామీ మొదలవుతుంది. ఆయన ఓపెనింగ్స్ రికార్డులను ఆయనే బ్రేక్ చేసుకుంటాడు. ఆ మధ్య ఓ సందర్భంలో దిల్ రాజు చెప్పినట్లు… విజయ్ సినిమాలు టాక్‌తో సంబంధంలేకుండా కోట్లు కొల్లగొడుతుంటాయని చెప్పాడు. దిల్ రాజు చెప్పినట్లే… ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం నిర్మాతలకు ప్రాఫిట్ వెంచర్‌లా మారిపోతాయి. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ‘బీస్ట్’ సైతం రెండొందల కోట్లు కొల్లగొట్టిందంటే మాములు విషయం కాదు. ఇక గతేడాది దసరాకు రిలీజైన ‘లియో’ ఏకంగా రూ.600 కోట్లు కొల్లగొట్టి ఆహా అనిపించింది.
ఇంకా చదవండి: ఇది షూటింగ్ కాదు.. అతి తెలివి ప్రదర్శించొద్దు! నటుడు విశాల్‌పై హైకోర్టు ఆగ్రహం!
ఇక ఇదిలా ఉంటే.. విజయ్ దళపతి కొత్తగా పొలిటికల్ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. రెండు సినిమాలు చేసి.. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితం కాబోతున్నట్లు కూడా ప్రకటించాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరో.. తను ఎంతో ప్రేమతో కొనుక్కున్న రోల్స్ రాయిస్ కారును అమ్మకానికి పెట్టినట్లు చెన్నై టాక్. అంతేకాకుండా ఆ కారును దాదాపుగా రూ.2.6 కోట్లకు అమ్మనున్నట్లు ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్ షిప్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. కాగా పార్టీని నడిపేందుకే విజయ్ కారును అమ్ముతున్నారని పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సినిమాకు వంద కోట్లపైనే తీసుకుంటున్నాడు. ఆస్తి చూస్తే రూ.500 కోట్లపైనే ఉంది.. అలాంటప్పుడు కారును అమ్ముకోవాల్సిన పరిస్థితేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ ‘G.O.A.T’ సినిమాలో నటిస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీనితో పాటుగా వెట్రీమారన్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు టాక్.
ఇంకా చదవండి: చంద్రబాబు పండుగ కానుక అదరహో! ఉచితంగా 3 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అప్పటి నుంచే? ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈ జాబ్ మేళాకు హాజరవ్వండి.. రూ.3 లక్షల శాలరీ ఆఫర్ అందుకోండి! లాస్ట్ డే ఎప్పుడు అంటే!
పవన్ కళ్యాణ్ కోరిక తీర్చిన మోదీ.. ఏపీలో 53 లక్షల మందికి తీపి కబురు! త్వరలోనే మరో గుడ్ న్యూస్!
మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?
రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!
పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?
వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!
జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!
కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!
ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!
ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!
సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!
పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!
ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: