ఫుడ్ పాయిజన్‌తో ఈ నెల 18న ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ ప్రముఖ నటి జాన్వీకపూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె సోదరి ఖుషీకపూర్, బాయ్‌ఫ్రెండ్ షిఖార్ పహారియా పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపారు. 18న ఆమె నీరసంగా ఉండడంతోపాటు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె ఫుడ్ పాయిజన్‌కు గురైనట్టు తెలిపారు. ఇప్పుడామె కోలుకుని ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జాన్వీ కపూర్ ఇటీవల బాయ్‌ఫ్రెండ్ షిఖార్‌తో కలిసి అనంత్ అంబానీ-రాధిక వివాహానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా ఆమె షేర్ చేశారు. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న దేవర సినిమాలో జాన్వీ నటిస్తోంది. అలాగే, రామ్ చరణ్ తదుపరి సినిమాకు కూడా ఆమె ఎంపికైంది.
ఇంకా చదవండి: ఏపీలో రికార్డు స్థాయిలో ఐఏఎస్ ల బదిలీ! ఒకేసారి 62 మంది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సినీనటి పై పోలీసు కేసు! అసలు ఆమె ఏమి చేసిందంటే?
శవ రాజకీయాలు చేయడం జగన్ పద్ధతి! 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిన సైకో!
ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...
సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!
రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభవార్త! రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం!
రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: