తెలుగు తెరపై సిల్క్ స్మిత.. అనురాధల హవా కొనసాగుతున్న సమయంలో అదే బాటలో ముందుకు వెళుతూ తనదైన ప్రత్యేకతను చాటుకున్న నటిగా అనూజ రెడ్డి కనిపిస్తారు. డాన్సర్ గాను .. వ్యాంప్ పాత్రలలోను ఆమె చాలా సినిమాలలో నటించారు. వివాహమైన తరువాత సినిమాలకు దూరమైన ఆమె, 20 ఏళ్ల తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్యూలో అనూజ మాట్లాడుతూ, "మాది గుంటూరు .. నా చిన్నప్పుడే మద్రాసుకి వెళ్లిపోయాము. అయినా మా ఇంట్లో అందరం తెలుగే మాట్లాడుతూ ఉంటాము.
ఇంకా చదవండి: హీరోయిన్ల విషయంలో నా లిమిట్ లో నేను ఉండేవాడినని వ్యాఖ్య! కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానన్న సుమన్!
తమిళంలో చేసిన 'చిన్నతంబి' .. తెలుగు నుంచి నాకు అవకాశాలు వచ్చేలా చేసింది. బ్రహ్మానందం .. బాబూ మోహన్ .. సుధాకర్ తో కలిసి ఎక్కువ సినిమాలు చేశాను" అని అన్నారు. "సిల్క్ స్మితతో కలిసి నేను నటించాను. ఆమె బిజీగా ఉండటం వలన చేయలేకపోయిన సినిమాలనే అప్పట్లో మేమంతా చేశామని చెప్పాలి. సిల్క్ స్మిత చాలా అందంగా ఉండేది .. బయటకూడా ఆమె అలాగే మాట్లాడేది. తన మేకప్ తానే చేసుకోవడం.. తన డ్రెస్ డిజైన్ తానే చేసుకోవడం ఆమె ప్రత్యేకత. ఆమెకి గర్వం .. పొగరు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ నిజానికి ఆమె చాలా మంచి మనిషి. చనిపోయేంతవరకూ ఆమె క్రేజ్ ఎంతమాత్రం తగ్గకపోవడం మేము చూశాము" అని చెప్పారు.
ఇంకా చదవండి: మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు! అమరావతి రైతుల ఉద్యమాన్ని అణణివేసేలా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లోకేశ్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ! ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ కన్నీటితో..
కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?
బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు!
విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు! సకాలంలో వైద్యసేవలు అందేలాజేసిన భువనేశ్వరి!
జగన్‌పై కేంద్ర మాజీ మంత్రి విమర్శలు! రాజకీయ వాతావరణంలో కలకలం! ఆరు నెలల్లో ఈయన ఎక్కడ ఉంటారో?
భరించలేని కీళ్ళ నొప్పులు ఈ సూపర్ ఫుడ్స్ తో తగ్గుతాయి! మరీ ఎందుకు ఆలస్యం తెలుసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: