బాలకృష్ణ 109వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగ్ కోసం బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా హైదరాబాద్ కు వచ్చింది. ఈమెపై ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. షూటింగ్ లో ఆమె గాయపడింది. గాయపడిన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె కాలికి ఫ్రాక్చర్ అయిందని, వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చామని చిత్ర యూనిట్ తెలిపింది.
ఇంకా చదవండి: త్రివిక్రమ్ బండారం బయట పెట్టిన హీరోయిన్! జీవితాలను నాశనం చేసే వ్యక్తి అంటూ పోస్ట్!
ప్రస్తుతం ఊర్వశి చికిత్స పొందుతోందని వెల్లడించింది. అయితే, ఆమె గాయం తీవ్రతపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఊర్వశికి గాయం కావడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... బాలయ్య సరసన ఊర్వశితో పాటు తెలుగమ్మాయి చాందిని చౌదరి నటిస్తోంది. విలన్ గా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' ఫేమ్ బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా... థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇంకా చదవండి: జగన్ కు షాక్! ఏపీలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ ఇద్దరు డీజీపీ ఆఫీస్‌కి రిపోర్టు చేయాలని ఆదేశాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ఐఏఎస్ బదిలీలపై కీలకమైన మార్పులు ! 19 మంది కొత్త పాత్రల్లో !
ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!
ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: