ధనవంతుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఈ జులై లో, తన స్నేహితురాలైన రాధికా మర్చెంట్ తో జరగనున్నసంగతి తెలిసిందే. ఇటీవలే గుజరాత్ జామ్ నగర్ లో మూడు రోజుల ప్రీవెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. అయితే ఈవెంట్ ఏదైనా సరే రాధికా మర్చెంట్ ధరించే ఖరీదైన దుస్తులు, ఆభరణాలు, హ్యాండ్ బ్యాగుల గురించి అహూతుల్లో ఆసక్తికర చర్చ సాగింది. ఇంతకుముందు పెళ్లి వేడుకలో అంబానీకి కాబోయే కోడలు రాధిక మర్చెంట్ ధరించిన హ్యాండ్ బ్యాగ్ ఖరీదు గురించి బోలెడంత చర్చ సాగింది. ఈ హీర్మేస్ కెల్లీ బ్యాగ్ విలువ 65 లక్షలు! అంటూ ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ మీడియా ఫోటోగ్రాఫర్ దాని ధరను వెల్లడించడంతో అందరూ షాక్ అవుతున్నారు.
పట్టుమని పది పెన్నులు, పిన్నులు అయినా ఇందులో పడతాయో లేదో.. కానీ ఇంత చిన్న బ్యాగ్ కోసం 65లక్షలు ఖర్చు పెడుతుందా అని, దీంతో ఒక అపార్ట్ మెంట్ కొనుక్కోవచ్చు! అంటూ నెటిజనుల్లో గుసగుసలు మొదలయ్యాయి
ఇది రాచరికపు దర్పానికి చిహ్నం. మినియేచర్ బ్యాగ్‌ల కొత్త ట్రెండ్‌కు అనుగుణంగా ఈ చిన్న బ్యాగ్ షహబ్-దురాజీ నుండి రూపొందినది. అయితే హీర్మేస్ కెల్లీ మార్ఫోస్ బ్యాగ్ ఎందుకు ఇంత ఖరీదైనది? అంటే ఇది కేవలం బ్యాగ్ మాత్రమే కాదు.. ఆభరణం అని కూడా అంటున్నారు.
ఈ ఐకానిక్ బ్యాగ్‌ని మరలా పునర్నిర్మించవచ్చు.. లేదా అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. దానిని శరీరం అంతటా స్లింగ్ చేయడానికి బదులుగా మెడ, మణికట్టు, వేళ్లకు ఆభరణంగా ఉపయోగించవచ్చు. రాధికా మర్చంట్ ఎంచుకున్నది స్టెర్లింగ్ సిల్వర్‌లోని హెర్మెస్ కెల్లీ సాక్ బిజౌ చైన్... అని హిందీ మీడియా విశ్లేషించింది.
ఇంకా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిస్కెట్ ఇదే! ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!
చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన అచార్య యార్లగడ్డ! ఎన్టీఆర్ కు భారత రత్న!
రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!
ఇకపై నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం! ఈవో ఆదేశాలు జారీ! పోటు కార్మికులతో సమావేశం!
ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే! గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందా!
ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!
ఆంధ్రప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: