2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. సీటు విషయంలో ఆశ భంగం కలిగింది. దీనికి తోడు ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చెందడంతో ఇక ఆ పార్టీని వీడేందుకు అలీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైసీపీకి మద్దతు తెలిపిన కొద్దిమంది ఇండస్ట్రీవాళ్లలో అలీ కూడా ఒకరు. పార్టీ కోసం ఆయన చాలా కష్టపడ్డారు. అయితే అలీ వైసీపీకి రాజీనామా వెనుక సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తం హస్తం ఉందనే రూమర్ తెర మీదకు వచ్చింది. ఆ వ్యక్తి ఇచ్చిన సూచనతోనే అలీ వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
ఇంకా చదవండి: తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!
జగన్ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ చాలా అవమానాలను ఎదుర్కొందని, సినిమా వాళ్లను జగన్ ఘోరంగా అవమానించారని విషయాన్ని గుర్తు చేస్తూ పార్టీకి రాజీనామా చేయాలని ఆ వ్యక్తి ఇచ్చిన సలహాతోనే అలీ వైసీపీ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. పైగా పార్టీలో తనకు సముచిత స్థానం దక్కకపోవడం, ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో అలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే అలీ రాజీనామాపై వైసీపీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని ఎదురిస్తే అవకాశాలు దక్కవనే విషయం తెలిసిందేనని, గతంలో ఇది పలుమార్లు రుజువు అయిందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అలీకి సినిమాలు తప్పిస్తే మరే వ్యాపార కార్యకలాపాలు లేవని బాహుశ అందుకే ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఉండవచ్చనే అభిప్రాయం వైసీపీ నాయకులు వెళ్లబుచ్చుతున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!
నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!
మీరు నమ్మాల్సిందే! ఇది అయోధ్య.. వైరల్ అవుతున్న న్యూస్! దారుణంగా రామాలయ పరిసర ప్రాంతాలు!
ఈ 35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్ బంద్! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?
తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!
ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!
ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న టాప్ పది దేశాలు! మొదటి స్థానంలో అమెరికా! భారత్ స్థానం?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: