ఫేర్ వెల్ పార్టీలో ఓ విద్యార్థితో కలసి స్కూల్ టీచర్ సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో ఇన్ స్టా గ్రామ్ ను ఊపేస్తోంది. కుషల్ ఎంజే పేరుతో ఓ యూజర్ అప్ లోడ్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు ఏకంగా 1.3 కోట్లకుపైగా వ్యూస్, 10 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఆ వీడియోలో చీరకట్టులో ఉన్న ఓ టీచర్ తన విద్యార్థితో కలసి బాలీవుడ్ చిత్రం ఆషికీ–2లోని ‘తుమ్ హి హో’ పాటకు డ్యాన్స్ చేయడం కనిపించింది. వారు డ్యాన్స్ చేస్తుండగా పక్కనున్న విద్యార్థులు తమ అరుపులు, కేకలతో మరింతగా ఉత్సాహపరిచారు. తరగతి గదిని అందంగా ముస్తాబు చేయగా బ్లాక్ బోర్డ్ పై ఫేర్ వెల్ సందేశాలు కూడా వీడియోలో కనిపించాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వీడియో చూసిన చాలా మంది ఆ విద్యార్థిని అదృష్టవంతుడిగా అభివర్ణించారు. అతను నా కలను అనుభూతి చెందుతున్నాడని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ టీచర్ తో డ్యాన్స్ చేయాలన్న కల కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకో యూజరేమో ‘నా స్కూల్ ఇలా ఎందుకు లేదు సోదరా?’ అని ప్రశ్నించాడు. ఇంకొకరేమో ఆ టీచర్ కచ్చితంగా ఇంగ్లిష్ మేడం అయ్యుంటుందన్నాడు.
ఇవి కూడా చదవండి:
హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్ లో కల్తీ! నటుడు బ్రహ్మాజీ ఫన్నీ కామెంట్స్! నెటిజన్ల రియాక్షన్ ఇదే!
తీవ్ర విషాదం... విరిగిపడిన కొండచర్యలు! 100 మందికి పైగా మృతుల సంఖ్య! ఎక్కడ అంటే!
అస్మిత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట! జూన్ 6 వరకు! వీరిపై ఎన్నికల కమిషన్ నిఘా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: