అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహనటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు. ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇంకా చదవండి: మృణాల్ ఠాకూర్: దానికి 'నో' చెప్పా.. అందుకే తగ్గాయి! తెరపై తాను అలా నటిస్తే!
ఇదిలా ఉంటే కీర్తి సురేష్‌కు బాలీవుడ్ నీళ్లు బాగా వంట పట్టినట్టు అనిపిస్తున్నాయి. అక్కడకు వెళ్లిన తరువాత కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచింది. ఇటీవల కీర్తి సురేష్ హాట్‌గా ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో కీర్తి సురేష్ గ్లామర్‌గా కనిపించి అందరికి షాకిచ్చింది. ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన కీర్తి సురేష్ తన అందాలతో అదరగొట్టింది. కీర్తిసురేష్ వేసుకున్న బ్లౌజ్ సైజ్ కూడా చాలా తక్కువగా కనిపిస్తోంది. క్లీవేజ్ షోతో కీర్తి అభిమానుల మతిపోగొట్టింది. తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్‌తో కీర్తి అదరగొట్టింది. ఓ పార్టీలో చీల్ అవుతూ కీర్తి సురేష్ కనిపించింది. ఈ పార్టీలో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న కీర్తి మరింత హాట్‌గా కనిపించింది. ఇక మీదట స్కిన్ షోకి రెడీ అంటూ కీర్తి సిగ్నల్ ఇస్తుంది. ముఖ్యంగా అమ్మడు బాలీవుడ్ వెళ్లిందో లేదో అక్కడ అదిరిపోయే రేంజ్‌లో గ్లామర్ షో చేస్తుంది. ప్రస్తుతం దీనికి కీర్తి గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: