బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది అనసూయ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తనకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిపింది. మీరు అందంగానే ఉన్నారు.. అయినా డైటింగ్ ఎందుకు చేస్తున్నారు? అని యాంకర్ అడిగింది. తాను అందం కోసం డైట్ చేయడంలేదని, ఆరోగ్యపరంగా జాగ్రత్తల కోసం చేస్తున్నానని అనసూయ చెప్పింది. బ్రీతింగ్ సమస్య వల్ల హాస్పటల్ లో ఆక్సిజన్ పెట్టాల్సిన స్టేజ్ వరకు పరిస్థితి వెళ్లింది. ఆరోగ్య పరంగా చాలా సీరియస్ కండిషన్ అయింది. ఎక్కువగా భావోద్వేగానికి గురైతే కండరాల్లో నొప్పులు కూడా వస్తాయని చెప్పింది.
ఇంకా చదవండి: మైండ్ సెట్ మార్చలేం.. విజయ్ దేవరకొండపై కొన్ని షాకింగ్ కామెంట్స్! పోస్ట్ వైరల్!!
అందుకే తాను బ్రీతింగ్, యోగ, ప్రాణాయామం చేస్తున్నట్లు తెలిపింది. వర్కౌట్స్ కూడా ప్రారంభించానని, ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటేనే మెంటల్‌గా కూడా స్ట్రాంగ్‌గా ఉంటామని చెప్పింది. అందుకే మీరు నన్ను రకరకాల షేపుల్లో చూస్తుంటారని, చిన్న కొడుకు పుట్టిన తర్వాత విపరీతంగా బరువు పెరిగి పోయానని చెప్పింది. తాను లావుగా ఉన్నాను అని ఎప్పుడూ ఫీల్ కాలేదని, హెల్త్ పరంగా ఏమైనా సమస్యలు వస్తాయని అనుకున్నాను'' అని చెప్పింది. ప్రస్తుతం అనసూయ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అనసూయకు ఇలాంటి సమస్యలున్నాయా? ఎప్పుడూ అలా కనపడలేదే.. ఎప్పుడూ చురుగ్గా ఉంటుండేది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అనసూయ ప్రస్తుతం పుష్ప2లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. ఈ పాత్ర తన కెరీర్ లో పెద్ద మైలురాయిగా నిలిచిపోతోందని, మలుపు తిరగడానికి ఇది కారణమవుతుందనే భావనలో అనసూయ ఉంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: