అందం,నటనతో చాలామంది అభిమానులను సంపాధించుకున్న అనసూయ.. వివాదాలతో కూడా నిత్యం సహవాసం చేస్తూనే ఉంది. అనసూయ ఏం చేసిన, ఏం మాట్లాడిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఇదే సమయంలో అనసూయ పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. అనసూయ గతంలో విజయ్ దేవరకొండపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో అనసూయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమెను టార్గెట్ చేసుకుని విజయ్ దేవరకొండ అభిమానులు రెచ్చిపోయి విమర్శలు చేశారు. వల్గర్ కామెంట్స్ చేస్తూ అనసూయను ట్రోల్ చేశారు.
ఇంకా చదవండి: ఇలియానా: సౌత్ లో నాకు సినిమా అవకాశాలు తగ్గిపోవడానికి కారణం ఇదే! అందుకే ఆ సినిమాకి ఓకే!
అనసూయ సైతం విజయ్ అభిమానులకు ధీటుగానే కౌంటరిచ్చింది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండను ఉద్దేశించి మరో పోస్ట్‌ను షేర్ చేసింది. గతంలో విజయ్ దేవరకొండ, పార్వతీ తిరువొత్తు, దీపికా పదుకొనే, ఆయుష్మాన్ ఖురానా మాట్లాడిన వీడియోను పోస్ట్‌ను షేర్ చేస్తూ కౌంటరిచ్చింది. ప్రేమను వ్యక్తం చేసేందుకు అనేక దారులున్నాయి. కొట్టడం ఒక్కటే కాదు కదా.. ఇలాంటి సీన్స్ చేసే దర్శకుల మైండ్ సెట్ మార్చలేనప్పుడు నటులే అలాంటి సినిమాలు చేయకుండా ఉంటే సొసైటీకి మేలు జరుగుతుందనే విధంగా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇలాంటి పద్ధతులపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: