తెలుగు సినీ పరిశ్రమలో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్ ఇలియానానే. ఇప్పుడు ఆమె సౌత్ ఇండస్ట్రీ నుంచి దాదాపు కనుమరుగు అయిందనే చెప్పుకోవాలి. కొత్తకొత్త హీరోయిన్లు వస్తుండటంతో ఆమె హవా తగ్గిపోయింది. తాజాగా ఆమె దక్షిణాదిలో ఎందుకు అవకాశాలు తగ్గాయో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. 2012లో తాను అనురాగ్ బసు దర్శకత్వంలో బాలీవుడ్ లో 'బర్ఫీ' చిత్రంలో ప్రధాన పాత్రను పోషించానని ఇలియానా తెలిపింది. ఆ టైమ్ లో తాను సౌత్ లో చాలా బిజీగా ఉన్నానని...
ఇంకా చదవండి: 61 సినిమాలు పూర్తిచేసిన 'అల్లరి నరేశ్'! అలాంటి సినిమాలు చేయవద్దని అమ్మ ఏడ్చింది..
అయితే, 'బర్ఫీ' వంటి చిత్రాల్లో అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని తాను భావించాని... అందుకే తాను ఆ సినిమాకి ఓకే చెప్పానని వెల్లడించింది. కానీ, దక్షిణాది వాళ్లంతా తాను సౌత్ ను వదిలేసి బాలీవుడ్ కి మకాం మార్చానని భావించారని అనుకున్నారని... ఆ ఆలోచనతోనే దక్షిణాది దర్శకనిర్మాతలు తనకు అవకాశాలు ఇచ్చేందుకు వెనుకాడారని తెలిపింది. బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తాను సినిమాలను ఎంచుకునే విధానంలో కూడా మార్పు వచ్చిందని ఇలియానా తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని తనకు అనిపిస్తుంటుందని చెప్పింది. ఇలా ఎందుకు జరిగిందో కూడా తనకు అర్థం కావడం లేదని తెలిపింది. ఇలియానా ఒక బిడ్డకు తల్లి అయిన సంగతి అందరికీ తెలిసిందే. దక్షిణాదిలో దాదాపు ఆమె కెరీర్ ముగిసినట్టేనని చెప్పుకోవచ్చు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: