త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది యంగ్ హీరోయిన్. ప్రస్తుతం ఇన్ స్టాలో ఆ ముద్దుగుమ్మ చేసి వెడ్డింగ్ వైబ్స్ పోస్టే దీనికి కారణమని చెప్పొచ్చు. తెలుగు, తమిళ బ్యూటీ అయిన మేఘా ఆకాష్ ప్రేక్షకులందరికీ సుపరిచితమే. లై సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. నటన పరంగా రాణించడంతోపాటు సినిమా ఫ్లాపైనప్పటికీ అవకాశాలు వరుసగా వచ్చాయి. చల్ మోహన్ రంగ, డియర్ మేఘా, ప్రేమదేశం, రాజరాజచోర, గుర్తుందా శీతాకాలం, రావణాసుర, మనుచరిత్ర లాంటి సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళలో ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కొడుకును పెళ్లిచేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేఘా ఆకాష్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఇంకా చదవండి: 2017లో లాస్య, మంజునాథ్ ప్రేమ వివాహం! యాంకర్ లాస్య ఇంట విషాదం!
తాజాగా ఈ బ్యూటీ పెళ్లి కూతురి వేషధారణలో దర్శనమిచ్చింది. వెడ్డింగ్ వైబ్స్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. దీంతో మరోసారి మేఘా ఆకాష్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లికి సిద్ధం కాబోతోందంటూ చర్చించుకుంటున్నారు. అది నిజం కాదని, యాడ్ షూట్ కోసం తీసిన తాజా చిత్రాలని, అందులో భాగంగానే వాటిని ఇన్ స్టాలో షేర్ చేసిందంటున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: