Boult లాంచ్ చేసిన క్రూయిజ్‌క్యామ్ X1 సిరీస్ డ్యాష్‌క్యామ్‌లు
ప్రఖ్యాత గ్యాడ్జెట్ తయారీ సంస్థ Boult తాజాగా కారు డ్యాష్‌బోర్డ్ కెమెరాలను విడుదల చేసింది. Boult Cruisecam X1 సిరీస్ పేరుతో రెండు కెమెరాలను లాంచ్ చేసింది: క్రూయిజ్‌క్యామ్ X1 మరియు X1 GPS. ఈ కెమెరాల డిజైన్ ఆకర్షణీయంగా ఉండి, అధిక నాణ్యత కలిగిన వీడియోలు రికార్డు చేసి, ఆన్‌రోడ్ భద్రతను మెరుగుపరుస్తుంది. ఈ డ్యాష్‌క్యామ్‌లతో Boult సంస్థ ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశించింది.
ఇంకా చదవండి: ధర రూ.12,000 కే 6.72 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా! అదిరిపోయే VIVO T3 లైట్ మీ కోసమే!
360 డిగ్రీల రొటేటింగ్ డిజైన్ మరియు GPS ట్రాకింగ్
బౌల్ట్ క్రూయిజ్‌క్యామ్ X1 మోడల్ 360 డిగ్రీల రొటేటింగ్ డిజైన్ కలిగి ఉండటం ద్వారా అవసరమైన యాంగిల్‌లో కెమెరాను సర్దుబాటు చేయవచ్చు. X1 GPS మోడల్‌లో రియల్ టైం వెహికల్ ట్రాకింగ్, వేగానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
సూపర్ కెపాసిటర్‌లు మరియు మెరుగైన పనితీరు
ఈ డ్యాష్‌క్యామ్‌లలో లిథియం బ్యాటరీల బదులుగా సూపర్ కెపాసిటర్‌లు ఉన్నాయి, దీంతో అధిక ఉష్ణోగ్రతల్లోనూ మెరుగైన పనితీరును కనబరుస్తాయి. ఎక్కువ కాలం వినియోగించుకోవడానికి వీలుగా ఉంటాయి.
ఇంకా చదవండి: సైబర్ నేరగాళ్ల కొత్త ప్రయత్నాలు! మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా! స్పందించారో మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తారు!
అధిక నాణ్యత వీడియో రికార్డింగ్: బౌల్ట్ క్రూయిజ్‌క్యామ్ X1 సిరీస్ 1080P పుల్ HD రిజల్యూషన్ తో వీడియోలను రికార్డు చేయగలదు. 2MP కెమెరాతో పగలు మరియు రాత్రి సమయాల్లోనూ అధిక నాణ్యత వీడియోలను క్యాప్చర్ చేస్తుంది. 170 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా బ్లైండ్ స్పాట్‌లను తగ్గిస్తుంది.
అత్యాధునిక ఫీచర్లు: ఈ డ్యాష్‌క్యామ్ G సెన్సార్‌తో వస్తుంది, ఇది ఆటోమేటిక్‌గా ప్రమాదాలను గుర్తించి వెంటనే వీడియోను రికార్డు చేస్తుంది. ఫలితంగా సాక్ష్యాలు సిద్ధం అవుతాయి. క్రూయిజ్‌క్యామ్ X1 GPS మోడల్ GPS ఫీచర్‌తో వాహనం లోకేషన్, వేగాన్ని పర్యవేక్షిస్తుంది, ప్రమాద సమయంలో సరైన డేటాను అందిస్తుంది.
ఇంకా చదవండి: ధర రూ.6999 కే 6.71 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ! అదిరిపోయే స్మార్ట్ ఫోన్ మీ కోసమే!
వైఫై కనెక్టివిటీ మరియు యాప్ సపోర్టు: డ్యాష్‌క్యామ్ వైఫైను సపోర్టు చేస్తుంది. ప్రత్యేక యాప్ ద్వారా డ్యాష్‌క్యామ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేయవచ్చు. ఈ యాప్ GPS ఇంటిగ్రేషన్ సహా వీడియో గ్యాలరీని కలిగి ఉంటుంది. వైఫై ద్వారా నేరుగా స్ట్రీమింగ్ చేయవచ్చు.
Boult క్రూయిజ్‌క్యామ్ X1 సిరీస్ ధర: బౌల్ట్ క్రూయిజ్‌క్యామ్ X1 ప్రారంభ ధర రూ.2999 కాగా, X1 GPS మోడల్ ధర రూ.3999 గా ఉంది. ఈ డ్యాష్‌క్యామ్‌లను Boult అధికారిక వెబ్‌సైట్ మరియు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఇంకా చదవండి: AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
జమ్మూ కాశ్మీర్ పర్యటనలో PM మోడీ! రాష్ట్ర హోదా, ఎన్నికలపై హామీ!
కేజ్రివాల్‌కు కోర్టు తాత్కాలిక బెయిల్! తీహార్ జైలు నుంచి శుక్రవారం విడుదల!
నీట్ అవకతవకలపై కేంద్రం కీలక చర్య! ప్రతిపక్ష నిరసనలపై మంత్రి స్పందన!
IRGCపై కెనడా తీవ్రవాద ట్యాగ్! ఇరాన్ స్పందన తీవ్ర విమర్శలతో!
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్! ఖరీఫ్ పంటల MSP భారీగా పెంపు!
చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! ఆ నలుగురికి శిక్ష తప్పదా!
మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?
తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!
ఎంపీ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారా! వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో దిగనుందా!
జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: