మారుతీ సుజుకీ నెక్సా లైనప్‌లోని వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇన్విక్టో మినహా దాదాపు అన్ని వాహనాలపై తగ్గింపు ఇస్తోంది. కొన్నింటిపై ఏకంగా రూ.74 వేల వరకు డిస్కౌంట్ ఇస్తుండడం గమనార్హం. అందులో ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, క్యాష్ డిస్కౌంట్లు, కార్పొరేట్ ప్రయోజనాలు సైతం ఉంటాయి. ఈ ప్రత్యేక తగ్గింపు ఆఫర్లు జూన్, 2024 చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచింది. అయితే కారు వేరియంట్లు, ట్రిమ్‌ల బట్టి డిస్కౌంట్ ప్రయోజనాలు మారొచ్చు.
రూ.6 లక్షలకే కొత్త కారు..
మారుతీ సుజుకీ కంపెనీకి ఇగ్నీస్ మోడల్ ఎంటీ వేరియంట్‌పై రూ.35 వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఏఎంటీ వేరియంట్ అయితే రూ.40 వేల వరకు రాయితీ పొందొచ్చు. దీంతో పాటు రూ.15 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.2 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ కారు ధర రూ.5.84 లక్షల నుంచి రూ. 8.11 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు
ఇతర మోడళ్లపై రూ.74 వేల తగ్గింపు..
మారుతీ సుజుకీ అందిస్తున్న డిస్కౌంట్లలో గ్రాండ్ విటారా హైబ్రిడ్ మోడల్‌పై అత్యధిక రూ.74 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ డిస్కౌంట్‌లో నేరుగా రూ.20 వేలు క్యాష్ డిస్కౌంట్‌తో పాటు, రూ.50 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4 వేల వరకు కార్పొరేట్ ప్రయోజనాలను పొందవచ్చు. టర్బో- పెట్రోల్ వేరియంట్‌లో వచ్చిన ఫ్రాంక్స్ పై రూ.74 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో రూ.15 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.10వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ద్వారా రూ.2 వేల తగ్గింపుతో పాటు రూ.43 వేల యాక్సెసరిటీ కిట్ లభిస్తాయి. 1.2 లీటర్ల పెట్రోల్, సీఎన్‌జీ ట్రిమ్‌పై రూ.15 వేల రాయితీ లభిస్తోంది. రూ.10 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.2 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ పొందొచ్చు. మారుతీ ఎక్స్ఎల్6 (XL6) పెట్రోల్ వేరియంట్‌పై రూ.30 వేల వరకు రాయితీ అందిస్తోంది కంపెనీ. ఇందులో రూ.10 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.20 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ కలిపి ఉంటాయి. ఇక సీఎన్‌జీ వేరియంట్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్‌ను రూ.10 వేలు మాత్రమే లభిస్తోంది. మారుతీ సుజుకీ జిమ్నీలోని అన్ని వేరియంట్లపై రూ.50 వేల వరకు రాయితీ పొందవచ్చు.
ఎటువంటి ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ బోనస్ లేకుండానే ఈ డిస్కౌంట్ లభిస్తోంది. దీని ప్రస్తుత ధర రూ.12.74 లక్షల నుంచి రూ.14.95 లక్షల మధ్య ఉంది. నెక్సా లైనప్‌లోని సియాజ్ పై రూ.48వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ రాయితీలో రూ.20వేల క్యాష్ డిస్కౌంట్, రూ.25 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. రూ.40 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.2 వేల కార్పొరేట్ బోనస్‌తో కలిపి సుజుకీ బ్యాలెనో వేరియంట్‌పై రూ.57 వేల వరకు రాయితీ అందిస్తోంది. ఇందులోని ఎంటీ వేరియంట్‌పై డిస్కౌంట్‌ను రూ.35వేల వరకు మాత్రమే పరిమితం చేసింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: