రెడ్‌మి నుంచి ఇటీవల రెడ్‌మి A3 స్మార్ట్‌ఫోన్ (Redmi A3 Smartphone) విడుదల అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చింది. విడుదల ధరతో పోలిస్తే 21 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఎంట్రీ లెవల్ ధరలోనే మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ సహా మీడియాటెక్ డైమెన్సిటీ 6020 SoC సహా 6.71 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మిడ్‌నైట్ బ్లాక్, ఓలివ్ గ్రీన్ మరియు లేక్ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. మరియు వెనుక గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. రెడ్‌మి A3 హ్యాండ్‌సెట్ 6.71 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్‌తోపాటు 720*1612 పిక్సల్ రిజల్యూషన్ మరియు 20:9 ఆస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. మరియు ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది. ఈ రెడ్‌మి కొత్త స్మార్ట్ ఫోన్ అండర్ ది హుడ్ మీడియాటెక్ హీలియో G36 తోపాటు PowerVR GE8320 పైన పనిచేస్తుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 13 ఆధారిత OSను కలిగి ఉంటుంది. 10W వైరడ్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఇంకా చదవండి: అంబానీ మామ ఫోన్ ఆ మజాకా..అదిరిపోయింది గా! అతి తక్కువ ధరకే Jio 5G స్మార్ట్ ఫోన్! ఫ్యూచర్స్ కేక! ఎప్పుడో తెలుసా?
కెమెరాల పరంగా ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 13MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా HDR సపోర్టుతో వస్తుంది. మరియు వెనుకవైపు డ్యూయల్ LED ప్లాష్ లైట్‌తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ రెడ్‌మి కొత్త హ్యాండ్‌సెట్ GPS, బ్లూటూత్ 5.0, GLONASS, Galileo, బీడీఎస్ వంటి అనేక కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్‌లో లభిస్తుంది. 3GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 4GB ర్యామ్ 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 3GB ర్యామ్ ధర రూ.6999 గా ఉంది. అదే 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.7999, 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.8999 గా ఉంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: