గుంటూరు: కమ్మ వారు సమాజానికి ఎంత మేలు చేశారో బయట ప్రపంచానికి తెలియజేయాలని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్ సూచించారు. గుంటూరు లోని కమ్మజన సేవా సమితి ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్వకాలం నుంచి కమ్మవారు సమాజం కోసం వేలాది ఎకరాలు భూముల్ని త్యాగం చేశారు అని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ డామ్ నిర్మాణానికి 1953లో ముత్యాల రాజు 5000 ఎకరాలు ఇచ్చి అంకురార్పణ చేశారని గుర్తు చేశారు. పది మందికి ఉపయోగపడే పనులు చేయడంలో తమ సామాజిక వర్గం వారు ఎప్పుడూ ముందుంటారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కంటే కమ్మవారు తమిళనాడు, కర్ణాటకలోనే ఎక్కువగా ఉన్నారని, వారందరినీ సంప్రదించి జులై 20, 21 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించాము అన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న సామాజిక వర్గ ప్రముఖులు విచ్చేస్తారన్నారు. అందరూ తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు, అధ్యక్షత వహించిన కమ్మజన సేవా సమితి అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ కమ్మ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు తమ వంతు సహకారం అందజేస్తాము అన్నారు. పెనమలూరు కమ్మజన సేవా సమితి కార్య దర్శి గుమ్మడి రామకృష్ణ, కేఐసీసీ అధ్యక్ష, కార్యదర్ములు యర్రా నాగేశ్వరరావు, కొత్తపల్లి రమేషకృష్ణ చంద్ర, ప్రవాసాంధ్రులు, ఎన్నారై టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ మాట్లాడారు. కార్యక్రమంలో సమితి కార్యదర్శి చుక్కపల్లి రమేష్, కోశాధికారి గోరంట్ల పున్నయ్య చౌదరి, ఉపాధ్యక్షుడు వడ్లమూడి నాగేంద్రం, సంయుక్త కార్యదర్శులు మర్రిపూడి సీతారామయ్య, గుంటుపల్లి కోటేశ్వరరావు, మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
కేదార్ నాథ్ కంట్రోల్ కోల్పోయిన హెలికాప్టర్! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం! భయంతో ప్రజలు!
ప్రతి వ్యాపారం, ప్రతి ప్రాంతం లో కమ్మ వారు ఉన్నారు. గత కొన్ని సంవ్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కమ్మ వారికి ఒక సంఘం అవసరం అనే ఉద్దేశంతో వివిధ రాష్ట్రాలలో ఉన్న వారితో చర్చించడం జరిగింది. అది ఇప్పుడు కార్యాచరణలోకి రానుంది. జూలై 20-21 న జరగబోయే కమ్మ గ్లోబల్ సమ్మిట్ (ప్రపంచ కమ్మ సదస్సు)కి దాదాపు ఒక 1500 మందిని ఆహ్వానించాలి అని చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్మ వారు దాదాపు 2.1 కోట్ల మంది ఉంటారు, భారత దేశ జనాభా లో 1.5% మంది కమ్మ వారు అంటారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో మన వారు ముందున్నారు.
ఇవి కూడా చదవండి:
కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్!
58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!
హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: