ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 65,392 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 29,015 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.23 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ట్రావెలర్స్ బంగళా వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. కాగా- వరాహస్వామి విశ్రాంతి భవనం, ప్రధాన షాపింగ్ కాంప్లెక్స్‌ను టీటీడీ కార్యనిర్వాహణాధికారి జే శ్యామలరావు ఈ మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇంకా చదవండి: యాదాద్రిలో స్వామి స్వయంభువుల దర్శనం కోసం ప్రత్యేక కాంప్లెక్స్‌లు! ఇందుకోసం ఆలయంలో ప్రత్యేకంగా!
షాపుల లైసెన్స్, వాటి రెన్యూవల్స్ సర్టిఫికెట్లను పరిశీలించారు. భక్తులు నడవడానికి వీలు లేకుండా దుకాణదారులు తమ వస్తువులను ఉంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని వెంటనే తొలగించాలని అన్నారు. వరండాలో సరకులను నిల్వ ఉంచడం వల్ల భక్తుల రాకపోకలకు అసౌకర్యం కలిగిస్తోందని శ్యామలరావు పేర్కొన్నారు. దుకాణదారులను, షాపింగ్ కాంప్లెక్స్ చుట్టుపక్కల ఆనధికారిక హాకర్లను హెచ్చరించాలంటూ సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. భక్తులు తిరిగడానికి వీలు లేకుండా దుకాణదారులు వస్తువులను ఉంచడం సరికాదని పేర్కొన్నారు. భక్తులు సజావుగా షాపింగ్ చేసే విధంగా, పరిశుభ్రంగా షాపింగ్ కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దాలని, దీనికి అనుగుణంగా తక్షణ చర్యలను తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. త్వరలో అనధికారిక హాకర్ల లైసెన్సులను తనిఖీ చేసి ఆక్రమణలను తొలగించాలని చెప్పారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ఐఏఎస్ బదిలీలపై కీలకమైన మార్పులు ! 19 మంది కొత్త పాత్రల్లో !
ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!
ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: