దేశవ్యాప్తంగా ఉన్న యువత అత్యధికంగా వెళ్లాలనుకునే టురిస్టు ప్రాంతాల్లో గోవాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి గోవాలు వెళ్లాలంటే ప్రయాణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీంతో చాలామంది యువకులకు ఈ టూర్ ను ఎప్పటికి ఓ కలగానే మిగిలిపోతుంది. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. ముక్యంగా హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు రైల్వే డిపార్ట్మెంట్ సికింద్రాబాద్ నుండి వాస్కోడిగామా(గోవా)కు బై వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా వెళుతుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అలాగే వాస్కోడగామ నుంచి గురు, శని వారాల్లో బయల్దేరి సికింద్రబాద్ చేరుతుంది. సికింద్రాబాద్ నుండి వాస్కోడగామా వరకు వెళ్లే ఈ బై వీక్లీ రైలు.. మధ్యలో కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్ స్టేషన్లలో ఆగనున్నట్లు తెలుస్తుంది. అలాగే రైలు సర్వీస్ కు సంబందించిన టికెట్ ధరలు వెబ్ సైట్లో చూడవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ నుంచి గోవాకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రధాని మోడీతో పాటు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి!
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు హత్య కేసులో 8 మంది అరెస్ట్! వెలుగులోకి కొత్త నిజాలు!
మీడియా ముందు ప్రత్యక్షమైన భోలే బాబా! హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే!
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దుర్గమ్మ ఆషాడ ఉత్సవాలు! 16 వరకూ వారాహి నవరాత్రులు!
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య! ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌గా వచ్చి దాడి!
చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో అంత ముఖ్యమైన టాపిక్ పై నో డిస్కషన్! ఎందుకంటే!
లిక్కర్ కేసులో కవితకు బెయిల్ కోసం కీలక నిర్ణయం! రంగంలోకి KTR, హరీష్ రావు!
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!
రేవంత్ రెడ్డితో భేటీపై స్పందించిన చంద్రబాబు! ఏమన్నారంటే!
వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ! త్వరలోనే అధికారిక ప్రకటన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: