ఆన్‌లైన్ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేందుకు రైల్వే టికెట్ బుకింగ్, క్యాటరింగ్ సంస్థ ఐఆర్‌సీటీసీలో అకౌంట్ ఉండాల్సి ఉంటుంది. అయితే, కొన్నిసార్లు ఎవరైనా తెలిసినవారు టికెట్లు బుక్ చేయమంటే తమ ఐడీ నుంచి ట్రైన్ టికెట్లు బుక్ చేస్తుంటారు చాలా మంది, అయితే, ఇకపై అలా కుదరదు. మీ పర్సనల్ ఐడీ నుంచి గనక ఇతరులకు ట్రైన్ టికెట్లు బుక్ చేసినట్లయితే మీకు జైలు శిక్ష, భారీ జరిమానా పడే అవకాశం ఉంది. రైల్వే రిజర్వేషన్లపై కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఖాతా ద్వారా ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే చిక్కుల్లో పడతారని గుర్తుంచుకోవాలి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పక్కవారికి సాయం చేద్దామని టికెట్లు బుక్ చేస్తే అది మిమ్మల్ని చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. రూల్స్ తెలియకుండా ఇతరులకు టికెట్లు బుక్ చేసిన వారికి గరిష్ఠంగా 3 ఏళ్ల పాటు జైలు శిక్ష, రూ.10 వేల వరకు జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. ఐఆర్‌సీటీసీలో వ్యక్తిగత ఖాతాలు ఉన్న వారు తమ రక్తసంబంధీకులు, ఒకే ఇంటి పేరు ఉన్నవారికి మాత్రమే టికెట్లు బుక్ చేసేందుకు అవకాశం ఉంది. స్నేహికులు, ఇతరులకు బుక్ చేస్తే రూ.10 వేల ఫైన్, మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. ఒక్కోసారి రెండూ ఉంటాయి. టికెట్ రిజర్వేషన్‌లో జవాబుదారీతనం తీసుకొచ్చి, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చినట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. కొత్త నిబంధనలు ఉల్లంగించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
ఇంకా చదవండి: బ్రిడ్జి నుంచి వేలాడుతూ రైలు ఇంజెన్‌కు రిపేర్! లోకోపైలట్ల సాహసం!
ఐఆర్‌సీటీసీ ద్వారా తత్కాల్ బుకింగ్ ఏసీ టికెట్ల టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి మొదలవుతుంది. అలాగే నాన్ ఏసీ టికెట్ల బుకింగ్ ఉదయం 11 గంటల నుంచి మొదలవుతుంది. అలాగే తమ ఆధార్ కార్డుతో ఐఆర్‌సీటీసీ ఐడీ లింక్ అయిన యూజర్లు నెలలో గరిష్ఠంగా 24 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ అనుసంధానం కాని ఖాతా అయితే 12 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునేందుకు వీలుంటుంది.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా: మెల్బోర్న్ లో ఘనంగా కూటమి విజయోత్సవ సంబరాలు! ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు!
దేశవ్యాప్తంగా ముగిసిన 'నీట్' రీ ఎగ్జామ్! ఎంత మంది హాజరయ్యారో తెలుసా!
ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వైసీపీకి అహంకారం దిగలేదు! విపక్షం రాని సభను ఇప్పుడే చూస్తున్నాం!
అతి త్వరలో అమరావతికి రైల్వే లైన్! భూసేకరణ షురూ!
రుషికొండ ప్యాలెస్ ను తనకు అమ్మాలి అంటూ చంద్రబాబుకు లేఖ! అది రాసింది ఎవరో కాదు!
పేపర్ లీక్ లను అరికట్టేందుకు యోగీ సర్కార్ కొత్త చట్టం! అత్యంత కఠినంగా రూల్స్!
అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: