ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే ఎయిరిండియా విమానం 30 గంటలు ఆలస్యమైంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో, ఎయిరిండియా దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. సాంకేతిక సమస్యల వల్ల శాన్ ఫ్రాన్సిస్కో రావాల్సిన ఫ్లైట్ డిలే అయ్యిందని ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ క్లాస్ గోయర్ష్ తెలిపారు. ఎయిరిండియా తరఫున ఆయన క్షమాపణలు చెప్పారు. భవిష్యత్ లో ప్రయాణించేందుకు ఒక్కో ప్రయాణికుడికి 350 డాలర్ల(రూ.29వేల) చొప్పున ట్రావెల్ వోచర్ ను అందజేస్తున్నట్లు ప్రకటించారు. వోచర్ ను ట్రావెల్ కోసం వాడుకోవచ్చని లేదంటే.. క్రెడిట్ చేసుకోవచ్చని తెలిపారు. ఎయిరిండియా సేవలో జరిగిన జాప్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు. ఫ్లైట్ డిలే, ప్రయాణికులపై నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆ తర్వాత ఎయిరిండియా ఈ ప్రకటన విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి:
సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఆ ఛానల్ లో మాత్రమే ఇలా!
ప్రపచవ్యాప్తంగా అత్యుత్తమ బడ్జెట్ ఎయిర్ లైన్స్! ఇండియాకు సంబంధించి!
భారత్ నుండి యూఏఈ వెళ్తున్నారా! అయితే ఇది మీ కోసమే! సేమ్ ఎయిర్ లైన్లో రిటర్న్ టికెట్ తప్పదు!
ఆ రెండు విషయాల్లో ఎమిరేట్స్ ఒకటవ స్థానంలో! ప్రీమియం ఎకానమీ కేక! ఓవర్ ఆల్ లో మాత్రం నెంబర్ 1 అదే!
ఎయిర్‌లైన్స్ రేటింగ్స్ ర్యాంకింగ్స్‌లో ఎయిర్ న్యూజిలాండ్ అగ్రస్థానం! టాప్ 5 స్థానాలలో ఏవంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: