ప్యారిస్‌లోని ఓర్లి ఎయిర్ పోర్ట్‌లో 70 శాతం విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రెంచ్ పౌర విమానయాన అధికారులు శనివారం ప్రకటించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ (ఏటీసీ) సమ్మెకు దిగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం అర్థరాత్రి వరకు ఈ విమాన సర్వీసులు రద్దు చేయనున్నట్లు తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సమ్మె చేయడం ఈ నెలలో రెండో సారి. యూరప్‌లో ఇలాగే ట్రాఫిక్ ఎయిర్ కంట్రోలర్స్ సమ్మెకు దిగడంతో, వేలాది విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. మరో వైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సమ్మె బాట పట్టడాన్ని ప్రభుత్వం ఖండించింది. ఇక ఈ ఏడాది జూలై 26వ తేదీ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. అలాంటి సమయంలో ఏటీసీ సిబ్బంది సమ్మె చేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇక ప్రాన్స్‌లో ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే రెండో ఎయిర్ పోర్ట్‌గా ఓర్లీ ఎయిర్ పోర్ట్ పేరు పొందింది. గతేడాది ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా 32 మిలియన్ల మంది ప్రయాణికులు, తన గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఈ ఎయిర్ పోర్ట్ నుంచి ఎయిర్ ప్రాన్స్, ట్రాన్స్‌వియా తోపాటు 20 ఎయిర్ లైన్స్‌కు చెందిన విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇంకోవైపు ఈ వీకెండ్ లో ఓర్లీ, ప్రెంచ్ విదేశీ భూభాగం మధ్య విమాన సర్వీసులు నడుపుతామని డీజీసీఏ అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్!
58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!
హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్!
కేదార్ నాథ్ కంట్రోల్ కోల్పోయిన హెలికాప్టర్! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం! భయంతో ప్రజలు!
ఫైనల్లోకి దూసుకెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్! 26న కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్! ఫాన్స్ లో ఉత్కంఠ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: