స్విట్జర్లాండ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో శాంతి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ వెనుకడుగు వేసింది. రష్యా ఈ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించడంతో, శాంతి ప్రక్రియలో ముందడుగు పడే అవకాశములేదని భారత్ భావించింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సహా 50 దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు స్విట్జర్లాండ్‌లో సమావేశమయ్యారు. రష్యా మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు. స్విస్ ఆల్పైన్ రిసార్ట్ స్టాన్స్‌స్టాడ్‌లో రెండు రోజుల చర్చలు జరిగాయి.
భారత్ తరఫున విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పవన్ కపూర్ ఈ సమావేశానికి ప్రాతినిధ్యం వహించారు. భారత్ ఉద్దేశం చర్చల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించడమేనని కపూర్ తెలిపారు. అన్ని పక్షాలు చర్చల్లో భాగం కావాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. మా విధానం స్థిరంగా ఉందని, దౌత్యం ద్వారా శాశ్వత శాంతికి మార్గం చూపించవచ్చని భారత్ పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆచరణాత్మక పరిష్కారం చూపాలని భారత్ అభిప్రాయపడింది.
ఈ సమ్మిట్‌లో 100కి పైగా దేశాలు మరియు సంస్థల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. చైనా కూడా ఈ సమావేశానికి హాజరైంది. కొన్ని దేశాలు ఉక్రెయిన్ మద్దతుగా సంతకాలు చేయగా, భారత్‌తో పాటు ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా దేశాలు శాంతి పత్రంలో సంతకాలను నిలిపివేశాయి.
ఇంకా చదవండి: కోడెలది ఆత్మహత్య కాదు! వైసీపీ నేతలు చేసిన హత్య!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!
ప్రజలకు మేలు చేసేలా పని చేయండి, లేకుంటే ఉపేక్షించం! అధికారులకు హోంమంత్రి అనిత సంచలన హెచ్చరిక!
రెండున్నర సంవత్సరాల్లో అమరావతిని అత్యుత్తమ రాజధానిగా! నిర్మిస్తామని నారాయణ ధీమా!
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం త్వరలో! ఇసుక, మట్టి దందా ఆరు నెలల్లో బయటపెడతాం!
ఏయూలో అవకతవకలపై LAW విద్యార్థిని! ఫిర్యాదు పై మంత్రి లోకేష్ స్పందన!
వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు! వృద్ధులకు అదనపు ప్రయోజనాలు!
ఏపీలో నైరుతి రుతుపవనాల దెబ్బ! ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు!
జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా! సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ!
సీఎంగా చంద్రబాబు తొలి ప్రాజెక్టు పర్యటన! సోమవారం పోలవరం పరిశీలన!
కర్నూలుకు కొత్త రూపం! పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలపై మంత్రి టీజీ భరత్ సమీక్ష!
పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!
AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: