ఏ రంగంలో రాణించాలన్నా మాటతీరు ఎంతో మృదువుగా ఉండాలి. ఎదుటివారు ఆకర్షితులవ్వాలి. సంస్కారవంతంగా మంచి మాటలు మాట్లాడుతుంటే మనకు తెలియకుండా ఎంతోమంది మనల్ని అభిమానిస్తారు.. స్ఫూర్తిగా తీసుకుంటారు. కానీ నోటి వాచాలత్వంతో ఎదుటివారు ఏస్థాయిలో ఉన్నారు.. మనం ఏ స్థాయిలో ఉన్నాం.. అనే విషయాలను మరిచి ఏదిపడితే అది మాట్లాడటం, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడంలాంటివి చేస్తే ఎవరూ హర్షించరు.. మాట్లాడినవారు కూడా తాత్కాలిక విజయాలను పొందుతారేకానీ అది శాశ్వతం కాదు. ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజాకు ప్రస్తుతం తత్వం బోధపడింది. ఎమ్మెల్యేగా ఓడిపోవడంతోపాటు అక్కడి నియోజకవర్గ ప్రజలు తిరగబడుతుండటంతో ప్రస్తుతం నగరి నుంచి చెన్నైకి మకాం మార్చారు. కొత్తగా ఉపాధిని పొందుదామని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంకా చదవండి: వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!
టీవీ రంగంలో గతంలో తాను చేసిన జబర్దస్త్ కార్యక్రమానికే మళ్లీ జడ్జిగా వెళ్దామని మల్లెమాల సంస్థ అధినేత ఎం.శ్యాంప్రసాద్ రెడ్డిని అడిగినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా, తెలంగాణలో రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబుపై, నారా లోకేష్ పై రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కోకొల్లలు. రాజకీయాల్లో వివాదాస్పదురాలిగా మారడంతోపాటు పై సంఘటనలను దృష్టిలో ఉంచుకున్న మల్లెమాల సంస్థ రోజాను నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు భాషల్లో ఉన్న టీవీ రంగంలో తనకు అవకాశాలు రావని గ్రహించి ఆమె తమిళం, కన్నడంలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త సెల్వమణి దర్శకుడు కావడంతో ఆయన కూడా అవకాశాల కోసం మాట్లాడుతున్నారని, తమిళంలో ఓ రెండు ఛానెళ్లలో కార్యక్రమాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఓ రెండు నుంచి మూడు సంవత్సరాలపాటు ఆమె రాజకీయాలకు, తెలుగు సినీరంగానికి దూరమైనట్లేనని భావిస్తున్నారు.
ఇంకా చదవండి: కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!
మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?
రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!
పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: