పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఏకంగా మూడు సినిమాలు (ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరహర వీరమల్లు) పెండింగ్ లో పడిపోయాయి. దీంతో దర్శక, నిర్మాతలు నెత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది. నూతన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అటు పాలనపై ఫోకస్ పెట్టడంతో సినిమాల వైపు రావట్లేదు. ఇటీవలే నిర్మాత రత్నం పవన్ ను కనీసం 10 రోజుల సమయం కావాలని అడిగిన విషయం తెలిసిందే. ఎందుకంటే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పవర్ స్టార్ 'హరహర వీరమల్లు' చిత్రం మిగతా షూటింగ్ పూర్తి చేద్దామనే ఆలోచనలో ఉన్నారట.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ మరోటి నెట్టింట దుమారం రేపుతోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓజీ' సినిమాకు డిప్యూటీ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సాధ్యమైనంత తొందరగా చిత్ర షూటింగ్ కంప్లీట్ చేస్తామని మేకర్స్ ప్రామిస్ కూడా చేశారంటూ సమాచారం. ఈ వార్త విన్న పవర్ స్టార్ అభిమానుల సంతోషం అంబరాన్నంటుతోంది. ఓజీ ఒక్కో సీన్ గూస్ బంప్స్ రావాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. శ్రేయరెడ్డి, శ్యామ్, అర్జున్ దాస్ తదితరులు మఖ్యపాత్రల్లో మెరవనున్నారు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చనున్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రాజధాని ప్రజలకు మరో గుడ్ న్యూస్! అమరావతిని అనుసంధానిస్తూ రూ.2,047 కోట్లతో రైల్వే ప్రాజెక్టు!

వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం! తాజాగా మరో ఎమ్మెల్యే!

ఢిల్లీలో జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ధర్నా! గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారనివ్యాఖ్యలు!

కక్షసాధింపు ఆలోచన లేదంటున్న టీడీపీ! రాష్ట్రంలో సమస్యలు గుర్తించి సూచనలు!

లండన్ లోని హైడ్ పార్కులో క్లీంకారతో మెగా ఫ్యామిలీ! పారిస్ లో సమ్మర్ ఒలింపిక్స్!

ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో "నాట్య నీరాజనం"! విజయవాడలో సాయంత్రం 6 గంటలకు!

రాత్రిపూట పెరుగన్నం తింటున్నారా? తింటే వచ్చే సమస్యలివే! ముఖ్యంగా వీరికి అస్సలు మంచిది కాదు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group