ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనతో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి, హిందీ నటి షబానా అజ్మీలకు.. ఆస్కార్ అవార్డులు అందజేసే అకాడమీలో సభ్యత్వ ఆహ్వానం అందింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా సుమారు 487 మంది కొత్త సభ్యులకు ఆహ్వానం పంపింది. కాగా, ఆస్కార్ అకాడమీ ఆహ్వానం అందుకున్న సెలబ్రిటీల్లో సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్, ఫిల్మ్‌మేకర్ రిమా దాస్, నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కూడా ఉన్నారు. అహ్వానం అందిన ప్రతి ఒక్కరూ ఆ కమిటీలో చేరితే అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 10, 910కి చేరుతుంది. ఇందులో సుమారు 9 వేల మంది ఆస్కార్ వేడుకల సమయంలో ఓటు వేయడానికి అర్హులు. ఇక అకాడమీ పత్రికా ప్రకటన ప్రకారం.. 2024 ఆహ్వాన జాబితాలో 44 శాతం మహిళలు, 41 శాతం ఎథ్నిక్ కమ్యూనిటీలు ఉన్నట్లు ఉన్నారు. యూఎస్ కాకుండా 56 దేశాలకు చెందిన ప్రముఖులు ఆహ్వానం అందుకున్నట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి: రజనీకాంత్ ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయి కి దిగజారి పోయావు! వైరల్ అవుతున్న ట్వీట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేయడంపై! అర్ధ రూపాయి డైలాగ్ చెప్తు జగన్ ట్వీట్!
అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!
యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్!
రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!
ఇకపై నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం! ఈవో ఆదేశాలు జారీ! పోటు కార్మికులతో సమావేశం!
ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే! గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందా!
ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: